ASBL NSL Infratech
facebook whatsapp X

రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌... కేటాయింపులు ఇలా

రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌... కేటాయింపులు ఇలా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181,26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26,216.28 కోట్లు. కేంద్ర గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. 
కేటాయింపులు ...

ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లు. ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లు. రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు. వ్యవసాయానికి రూ.72,659 కోట్లు. ఉద్యానశాఖకు రూ.737 కోట్లు, పశుసంవర్ధశాఖకు రూ.1,980 కోట్లు. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రూ.723 కోట్లు. గృహజ్యోతికి రూ.2,418 కోట్లు. ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836 కోట్లు. పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు రూ.1,525 కోట్లు. స్త్రీ శిశు సంక్షేమానికి రూ.2,736 కోట్లు. ఎస్సీ సంక్షేమం రూ.33,124 కోట్లు. ఎస్టీ సంక్షేమం రూ.17,056 కోట్లు.  మైనార్టీ సంక్షేమం రూ.3,003 కోట్లు. బీసీ సంక్షేమం రూ.9,200 కోట్లు. వైద్య ఆరోగ్యం రూ.11,468 కోట్లు. ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు. అడవులు పర్యావరణం రూ.1,064 కోట్లు. పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు. ఐటీ శాఖకు రూ.774 కోట్లు. నీటిపారుదల రంగానికి రూ.22,301 కోట్లు. విద్యకు రూ.21,292 కోట్లు. హోంశాఖకు రూ.9,564 కోట్లు. రోడ్లు, భవనాల శాఖకు రూ.5,790 కోట్లు కేటాయించడం జరిగింది.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :