ASBL NSL Infratech

బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలి మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలి మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51శాతం, కేంద్ర ప్రభుత్వానికి 41శాతం వాటాలున్నట్లు ప్రధానమంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించాలని, అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ 3 గనులనూ సింగరేణికే కేటాయించాలని ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రధానమంత్రి నివాసానికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు గంటసేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :