న్యూయార్క్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి బృందం న్యూ యార్క్ JFK (జాన్ F కెన్నెడీ) ఎయిర్ పోర్ట్ లో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ నేడు (3 ఆగస్టు 24) మధ్యాన్నం 3pm కి చేరుకొన్నారు.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, తెలంగాణ చాప్టర్ మరియు ఇండియన్ డయాస్పోరా తరుఫున అనేక మంది తెలుగు నాయకులు, కాంగ్రెస్ అభిమానులు, తెలంగాణ అభిమానులు వచ్చి ఘన స్వాగతం తెలిపారు.
ఆయనకు ఇండియన్ కాన్సల్ జనరల్, న్యూ యార్క్ ఏర్పాటు చేసిన డిప్లొమాటిక్ మార్గం లో బయటకు వచ్చిన శ్రీ రేవంత్ రెడ్డి కి అభిమానులు పూల గుచ్చాలు, కాంగ్రెస్ కండువాలు, షాల్స్ తో స్వాగతం తెలిపారు.
వెంటనే శ్రీ రేవంత్ రెడ్డి ఫిలడెల్ఫియా లో తన సోదరుడు జగదీశ్ రెడ్డి స్వగృహానికి తరలి వెళ్లారు. ఈ రోజు అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి, రేపు (ఆదివారం, 4 ఆగస్టు ) ఉదయం న్యూ జెర్సీ లో హోటల్ షారటన్ కి చేరుకొంటారు.
ఉదయం హోటల్ నుంచి ఇండియన్ డయాస్పోరా ఏర్పాటు చేసిన మీటింగ్ కి వస్తారు. హోటల్ నుంచి సభాస్థలి వరకు కార్ ర్యాలీ లో అభిమానులు తీసుకు వెళతారు.