ASBL NSL Infratech

హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ అభివృద్ధి : రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ అభివృద్ధి : రేవంత్‌ రెడ్డి

వరంగల్‌ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. వరంగల్‌ పర్యటనలో ఉన్న సీఎం నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. హెరిటేజ్‌ సిటీగా తీర్చిదిద్దటానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలని, దానికి అవసరమైన నిధుల వివరాలు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. హైవేలను అనుసంధానిస్తూ వరంగల్‌  ఔటర్‌ రింగ్‌రోడ్డు ఉండేలా చూడాలన్నారు. ఓఆర్‌ఆర్‌ నుంచి టెక్స్‌టైల్‌ పార్కును అనుసంధానించాలని చెప్పారు. స్మార్ట్‌సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలని, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డంపింగ్‌ యార్డు  సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :