ASBL Koncept Ambience
facebook whatsapp X

వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో

వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టమైన మయోనైజ్‌పై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కల్తీ ఆహారం తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతోన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మయోనైజ్‌ను ఎక్కువగా మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినా హోటళ్లు తీరు మార్చుకోవట్లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరింది.

 


 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :