ASBL NSL Infratech

23న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ?

23న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ?

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఈ నెల 23న  శాసనసభలో ప్రవేశ పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌ను ఈ నెల 22న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ చర్చలు పూర్తయ్యాక రాష్ట్ర బడ్జెట్‌ ఎంత అనే దానిపై మరింత స్పష్టత రానుంది. ప్రధానంగా రుణమాఫీ,  రైతుభరోసా, ఉచిత విద్యుత్‌, సాగునీటి రంగానికి  బడ్జెట్‌లో అధికంగా కేటాయింపులు ఉండవచ్చనని అంచనా. గ్యారంటీ హామీల అమలుకూ భారీగా నిధుల కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యయం రూ.28 వేల కోట్లు దాటింది. మిగిలిన పది నెలల్లో మరో రూ.2 లక్షల కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :