ASBL Koncept Ambience
facebook whatsapp X

కేఏ పాల్‌ కు షాక్‌ ఇచ్చిన హైకోర్టు

కేఏ పాల్‌ కు షాక్‌ ఇచ్చిన హైకోర్టు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని కేఏ పాల్‌ పిటిషన్‌లో కోరారు. వారు అసెంబ్లీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా, తీర్మానాల్లో ఓటు వేయకుండా ఆదేశించాలన్నారు. దానం నాగేందర్‌ గత పదేళ్లలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మారుతూ వస్తున్నారని పేర్కొన్నారు.  ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఇలా పార్టీలు  మారితే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని చెప్పారు. వాళ్లపై చర్యలు తీసుకోపోతే ఎమ్మెల్యేలు పార్టీ మారడం సహజమైపోతుందని కేఏ పాల్‌ వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం స్పీకర్‌ పరిధిలో ఉందని హైకోర్టు చెప్పింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఇటీవల తీర్పులో వెలువరించామని పేర్కొంది. స్పీకర్‌ నిర్ణయం తీసుకోకముందే ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వెళ్లకుండా ఆదేశించలేమని స్పష్టం చేసింది.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :