ASBL Koncept Ambience
facebook whatsapp X

పరిశ్రమలకు ప్రొత్సాహాలు - రేవంత్ రెడ్డి

పరిశ్రమలకు ప్రొత్సాహాలు - రేవంత్ రెడ్డి

మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్త ఎంస్ఎంఈ పాలసీ-2024 ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన కృషిని ఎవరూ మరువలేరని అన్నారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకే ఎంఎస్ ఎంఈ పాలసీని తీసుకొచ్చామన్నారు. పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూని వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్కిల్ యూనివర్సిటీ లో పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు పెడతామన్నారు.   విధానపరమైన రూపకల్పనలు లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి చెందదని తెలిపారు. ప్రభుత్వం విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమలకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు.  

తెలంగాణకు ఐటి నీ తెచ్చింది..అభివృద్ధి చేసింది కాంగ్రెస్ అన్నారు. పరిపాలన విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లీవ్ అన్నారు. మంచి పని కొనసాగిస్తామని,.. విఘాతం కలిగించే అంశాలు ఉంటే తొలగిస్తామని అన్నారు. బాగా చదువుకుని విద్యార్దులు సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారని, కానీ ఉద్యోగం కి వచ్చేసరికి సర్టిఫికెట్లు అక్కరకు రావడం లేదన్నారు. స్కిల్ ఎంప్లాయి రావడం లేదని పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారన్నారు. అందుకే ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ కింద్రాలు గా మార్చ బోతున్నం అన్నారు. రేపు పారిశ్రామిక వేత్తలతో ఆనంద్ మహేంద్ర సమావేశం ఉందని అంటూ, . స్కిల్ యూనివర్సిటీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తారన్నారు. ఇందులో రాజకీయ ప్రయోజనం ఏం లేదన్నారు.
 

 

 

 

 


 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :