ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవీ శ్రీ టాలెంట్ ను గుర్తించ‌ని తెలుగు ఆడియ‌న్స్

దేవీ శ్రీ టాలెంట్ ను గుర్తించ‌ని తెలుగు ఆడియ‌న్స్

మ‌న తెలుగు ఆడియ‌న్స్ వేరే భాష సినిమాల‌ను నెత్తిన పెట్టుకున్న‌ట్లు తెలుగు సినిమాల‌ను, వాటిలోని గొప్ప‌ద‌నాన్ని, మ‌న వాళ్ల టాలెంట్ ను గుర్తించ‌రు అని అంద‌రూ అంటుంటారు. త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్(Anirudh) కు తెలుగులో కూడా ఎంతో క్రేజ్ ఉంది. అత‌న్నుంచి ఏదైనా కొత్త సాంగ్ వ‌స్తే దాన్ని మ‌న‌వాళ్లే ఎక్కువ ట్రెండ్ చేస్తుంటారు.

అనిరుధ్ కు ఎన్నో ఎలివేషన్స్ ఇచ్చి అత‌న్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. అనిరుధ్ కు అంత‌టి ఎలివేష‌న్స్ ఇచ్చే మ‌న తెలుగు ఆడియ‌న్స్, మ‌న తెలుగు స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ(Devi Sri Prasad) వ‌ర్క్ ను మాత్రం గుర్తించ‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న ఫ్యాన్స్ బాధ ప‌డుతున్నారు. దేవీశ్రీ ఒక‌ప్ప‌టిలా మ్యూజిక్ ఇవ్వ‌క‌పోయినా అప్పుడ‌ప్పుడు మాత్రం త‌న టాలెంట్ ను బ‌య‌ట‌పెడుతున్నాడు.

తాజాగా సూర్య(Suriya) కంగువ(Kanguva)కు దేవీ ఇచ్చిన అవుట్‌పుట్ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను మెప్పిస్తుంది. కంగువ‌కు సంబంధించిన టీజ‌ర్, ట్రైల‌ర్ లోని బీజీఎం కూడా అదిరిపోయింది. సాంగ్స్ కూడా బావున్నాయి. తాజాగా కంగువ నుంచి రిలీజైన వార్ సాంగ్(War Song) నెక్ట్స్ లెవెల్ అనేట్లుంది. కానీ ఈ సాంగ్ గురించి ఎక్కువ‌గా ఎవ‌రూ మాట్లాడట్లేదు. ఇదే పాట అనిరుధ్ కంపోజ్ చేసి ఉంటే వావ్.. అద‌ర‌హో! అనే వాళ్లు. తెలుగు ఆడియ‌న్సే మ‌న టాలెంట్ ను ఎంక‌రేజ్ చేయ‌క‌పోవ‌డం నిజంగా బాధాక‌రం.  

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :