ASBL Koncept Ambience
facebook whatsapp X

Cine Industry: టాలీవుడ్ స్టార్స్ రియాక్షన్స్..! అప్పుడేమయ్యారంటూ ట్రోల్స్..!!

Cine Industry: టాలీవుడ్ స్టార్స్ రియాక్షన్స్..! అప్పుడేమయ్యారంటూ ట్రోల్స్..!!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda surekha).. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలు ఓ ప్రముఖ సినీ తారకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారానికి (personal life) సంబంధించినవి కావడంతో విపరీతంగా వైరల్ (viral) అయ్యాయి. ఆవిడ కామెంట్స్ ను టాలీవుడ్ లోని (Tollywood) ప్రముఖులందరూ ఖండించారు. ఆమె కూడా తన చేసింది తప్పేనంటూ మాటలను ఉపసంహరించుకున్నారు. అయితే ఓ సినిమా తారపై కామెంట్స్ చేయగానే లేచిన నోళ్లు.. గతంలో పలు సందర్భాల్లో మహిళలపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు లేవలేదనే ప్రశ్నలు సోషల్ మీడియాలో (social media) వెల్లువెత్తుతున్నాయి.

గతంలో వైసీపీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali).. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ను ఉద్దేశించి దారుణ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులను తూలనాడారు. ఆడవాళ్లపై బూతులతో విరుచుకుపడ్డారు. కానీ ఒక్కరంటే ఒక్క సినిమా నటుడు లేదా నటి ఆ వ్యవహారంపై నోరు మెదపలేదు. చివరకు చిరంజీవి (Chiranjeevi) కూడా పోసాని మాటలను ఖండించలేదు. ఇప్పుడు కొండా సురేఖ కామెంట్స్ పై మాత్రం ఇండస్ట్రీ (Cinema Industry) మొత్తం ఏకమై ట్వీట్లు (tweets) చేస్తున్నారు. మరి అప్పుడు స్పందించలేదంటూ పలువురు సోషల్ మీడియాలోనే వాళ్లను ప్రశ్నిస్తున్నారు.

ఇక చంద్రబాబు నాయుడు (Chandrababu) భార్య భువనేశ్వరిపై (Bhuvaneswari) సాక్షాత్తూ అసెంబ్లీలో అప్పటి అధికార పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కన్నీటిపర్యంతమై అసెంబ్లీకి ఇక రానని శపథం చేసి బయటికొచ్చేశారు. ఈ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీ స్పందించాలని పలువురు నేతలు కోరారు. కానీ ఎవరూ జోక్యం చేసుకోలేదు. బహుశా అది రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం అని ఊరుకుని ఉండొచ్చు. దాన్ని పక్కన పెడదాం.. మరి పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ల (Pawan Kalyan marriages) గురించి నాడు వైసీపీ నేతలు (YCP Leaders) ఎన్నెన్ని మాటలన్నారో అందరికీ తెలుసు. అయినా సినిరంగానికి చెందిన ఒక్కరు కూడా వాళ్ల కామెంట్స్ ను ఖండించలేదు. నోరు మెదపలేదు.

ఇలా చెప్పుకుంటే ఎన్నో సంఘటనలున్నాయి. సాక్షాత్తూ సినీ రంగానికి చెందిన రామ్ గోపాల్ వర్మే (RGV).. లోకేశ్ (Lokesh) ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్వీట్లు చేశారు. మరి రాజకీయ నాయకులతో వర్మకు ఏం సంబంధం అని సినీ రంగానికి చెందిన ఒక్కరు కూడా అడగలేదు. అంటే ఒక్కొక్కరిని ఒక్కోలా ట్రీట్ చేస్తోంది సినిమా ఇండస్ట్రీ. అధికారంలో పార్టీలను బట్టి కూడా వాళ్ల తీరు మారుతోంది. ఇదేనా సినిమా ఇండస్ట్రీ ఇంటిగ్రిటీ..? ఇలాగేనా సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ అయ్యే తీరు..? దీన్ని సంఘీభావం అనాలా.. చేతకానితనం అనుకోవాలా..?

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :