ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలుగు కళా సమితి బ్యాడ్మింటన్ టోర్నీకి ముహూర్తం ఫిక్స్

తెలుగు కళా సమితి బ్యాడ్మింటన్ టోర్నీకి ముహూర్తం ఫిక్స్

యువతలో ఉత్సాహం పెంచడానికి తెలుగు కళా సమితి (టీఎఫ్ఏఎస్) ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నీకి ముహూర్తం ఫిక్స్ అయింది. అక్టోబరు 6వ తేదీ (ఆదివారం) నాడు న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ బ్యాడ్మింటన్ క్లబ్ వేదికగా ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ టోర్నీని రెండు కేటగిరీల్లో నిర్వహిస్తున్నారు. 13 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలు, మహిళలు, పురుషుల విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే వారు సింగిల్‌గా అయితే ప్లేయర్‌కు 25 డాలర్లు, అదే టీం అయితే 50 డాలర్లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు సెప్టెంబరు 30వ తేదీలోపు http://www.tfasnj.org వెబ్‌సైటులో రిజిస్టర్ చేసుకోవచ్చు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :