ASBL Koncept Ambience
facebook whatsapp X

త‌మ‌న్ మ్యూజిక్ మ‌ళ్లీ స్టార్ట్స్

త‌మ‌న్ మ్యూజిక్ మ‌ళ్లీ స్టార్ట్స్

గుంటూరు కారం సినిమాకు త‌మ‌న్ మంచి మ్యూజిక్ ఇవ్వ‌లేద‌ని, ఫ్యాన్స్ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాడని తిట్టుకున్నారు కానీ ఇప్ప‌టికీ ఆ సినిమాలోని కుర్చీ మ‌డ‌త‌పెట్టి సాంగ్ ఈ ఇయ‌ర్ లోనే టాప్ ఛార్ట్ బ‌స్ట‌ర్ల‌లో ఒక‌టిగా ఉంది. ఆ త‌ర్వాత త‌మ‌న్ నుంచి వ‌చ్చిన సాంగ్ గేమ్ ఛేంజ‌ర్ లోని జ‌ర‌గండి జ‌ర‌గండి మాత్ర‌మే.

ఇప్పుడు మ‌ళ్లీ 5 నెల‌ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత త‌మ‌న్ కు మళ్లీ సౌండ్ చేసే ఛాన్స్ దొరికింది. డిసెంబ‌ర్ 20న రిలీజ్ కానున్న గేమ్ ఛేంజ‌ర్ నుంచి సెకండ్ సింగిల్ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. రిలీజ్ కు చేతిలో ఉన్న మూడున్న‌ర నెల‌ల టైమ్ ఇప్పుడు త‌మ‌న్ కు ఎంతో కీల‌కం. దీంతో త‌మ‌న్ మీద చాలా వ‌ర్క్ ప్రెజ‌ర్ ఉండ‌బోతుంది.

ఇండియ‌న్2 మ్యూజిక్ విష‌యంలో వ‌చ్చిన కామెంట్స్ గేమ్ ఛేంజ‌ర్ కు రాకుండా ఉండేలా త‌మ‌న్ నుంచి బెస్ట్ వ‌ర్క్ రాబట్టుకోవాల‌ని శంక‌ర్ చూస్తున్నాడ‌ట‌. ఓ వైపు గేమ్ ఛేంజ‌ర్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లో బిజీగా ఉంటూనే మ‌రోవైపు త‌న టీమ్ తో షూటింగ్ చేయిస్తున్నాడు శంక‌ర్. గేమ్ ఛేంజ‌ర్ ఫ‌స్ట్ సాంగ్ తో మూట కట్టుకున్న నిరాశ‌ను తొలగించాలంటే త‌మ‌న్ సెకండ్ సాంగ్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ సినిమా త‌ర్వాత ఓజి హంగామా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమాకు కూడా త‌మ‌నే మ్యూజిక్. మొత్తానికి ఇక‌పై మ‌ళ్లీ త‌మ‌న్ సౌండ్ మారుమ్రోగ‌నుంద‌న్న‌మాట‌.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :