ASBL Koncept Ambience
facebook whatsapp X

మ‌రోసారి దొరికిపోయిన త‌మ‌న్

మ‌రోసారి దొరికిపోయిన త‌మ‌న్

ఇండియా మొత్తం మీద సోష‌ల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే మ‌రో ఆలోచ‌న లేకుండా త‌మ‌న్(Thaman) పేరు చెప్పొచ్చు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ఎన్నో పెద్ద సినిమాల‌కు త‌మ‌న్ మ్యూజిక్ ఇచ్చిన‌ప్ప‌టికీ, ఎన్నో హిట్ మూవీస్ త‌న ఖాతాలో ఉన్న‌ప్ప‌టికీ అత‌డి మీద రెగ్యుల‌ర్ గా విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉంటాయి.

ట్యూన్స్ కాపీ కొట్టి సాంగ్స్ చేస్తాడ‌ని, త‌న పాట‌ల‌ను, ట్యూన్ల‌ను తానే రిపీట్ చేస్తుంటాడ‌ని త‌మ‌న్ పై ఎన్నో విమ‌ర్శ‌లున్నాయి. త‌మ‌న్ నుంచి ఏదైనా సాంగ్ రిలీజైతే ముందు ఆ పాట‌ను ఎక్క‌డినుంచి కాపీ కొట్టాడా అని వెతుకుతుంటారు నెటిజ‌న్లు. ఆ శోధ‌న‌లో ఏదైనా పోలిక క‌నిపిస్తే చాలు మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోతారు. ఇదిలా ఉంటే తాజాగా త‌మ‌న్ మ‌రోసారి నెటిజ‌న్ల‌కు దొరికిపోయాడు.

తాజాగా త‌మ‌న్ సంగీతం అందించిన బాల‌కృష్ణ(Balakrishna) డాకు మ‌హారాజ్(Daku Maharaj) టీజ‌ర్ రిలీజ‌వ‌గా ఆ విజువ‌ల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. అయితే టీజ‌ర్ ఎండింగ్ లో వ‌చ్చిన మ్యూజిక్ ద‌గ్గ‌ర త‌మ‌న్ దొరికిపోయాడు. ఇస్మార్ట్ శంక‌ర్(Ismart Shankar) సినిమాలో దుంప దెంచేశావే సాంగ్(Dumpa Denchesave) స్టార్టింగ్ లో వ‌చ్చే మ్యూజిక్, డాకు మ‌హారాజ్ టీజ‌ర్ చివ‌ర్లో వినిపించిన సౌండ్ ఒకేలా ఉన్నాయ‌ని త‌మ‌న్ ను కింగ్(King) సినిమాలో బ్ర‌హ్మి(Brahmi)- నాగ్(Nag) ట్రాక్ తో వ‌చ్చే మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.  

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :