ఒకే నెలలో తండ్రీ కొడుకుల సినిమాలు
నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్(Thandel) సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సంక్రాంతికి రావాలని ఫ్యాన్స్ కోరుకున్నారు కానీ అంతటి పోటీలో అనవసరంగా ఓపెనింగ్స్ తగ్గించుకోవడం ఇష్టం లేని నిర్మాతలు ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యారు.
ఇదిలా ఉంటే అదే ఫిబ్రవరిలో కుబేర(Kubera) సినిమా కూడా రిలీజ్ కానుందని టాక్. శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరో ధనుష్(Dhanush) అయినప్పటికీ నాగార్జున(Nagarjuna) కీలకపాత్ర పోషిస్తున్నాడు. లీడర్(Leader) తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సీరియస్ సబ్జెక్ట్ ఇదే. ఈ సినిమాను ఫిబ్రవరి 14 లేదా 21న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే యాంగిల్ లో టీమ్ చర్చలు జరుపుతుందట.
తండేల్ ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది కాబట్టి తండ్రీ కొడుకుల మధ్య కనీసం ఎంత లేదన్నా రెండు వారాల గ్యాప్ ఉండటం అవసరం. అదే నిజమైతే ఫిబ్రవరి 21 కుబేరకు మంచి డేట్. ఈ నెల 15న రిలీజ్ కానున్న టీజర్ లాంచ్ సందర్భంగా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చే అవకాశముంది. రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శేఖర్ కమ్ముల ఊహించని ట్విస్టులతో రూపొందించాడట.