ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ డేట్ పై తండేల్ క‌న్ను?

ఆ డేట్ పై తండేల్ క‌న్ను?

నాగ చైత‌న్య హీరోగా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తండేల్ సినిమాకు రిలీజ్ డేట్ రూపంలో పెద్ద స‌మ‌స్య ఎదురైంది. తండేల్ ను డిసెంబ‌ర్ 20న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ కొన్ని నెల‌ల కింద‌టే అనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ స‌డెన్ గా గేమ్ ఛేంజ‌ర్ ఆ డేట్ పై క‌న్నేయ‌డంతో ఇప్పుడు తండేల్ ఆ డేట్ నుంచి త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

పోనీ డిసెంబ‌ర్ 20 నుంచి సంక్రాంతికి వాయిదా వేద్దామంటే ఇప్ప‌టికే పెద్ద సినిమాల‌న్నీ షెడ్యూల్ అయి ఉన్నాయి. దానికి తోడు చిరంజీవి సినిమా ఉంది కాబ‌ట్టి అల్లు అర‌వింద్ పోటీకి వెళ్ల‌డు. ఈ నేప‌థ్యంలో తండేల్ జ‌న‌వరి 25 లేదా జ‌న‌వరి 26న తండేల్ ను రిలీజ్ చేసే దిశ‌గా టీమ్ ఆలోచిస్తున్నార‌ట‌. ఓటీటీ డీల్ ఇప్ప‌టికే క్లోజ్ అయింది.

కాబ‌ట్టి థియేట్రిక‌ల్ రిలీజ్ ఎక్కువ లేట్ చేయ‌డానికి కుద‌ర‌దు. అందుకే షూటింగ్ కు గ్యాప్ లేకుండా కొన‌సాగిస్తున్నారు. రీసెంట్ గా వాఘా బోర్డ‌ర్ లో ఓ ఎపిసోడ్ ను షూట్ చేశారు. ఒక‌వేళ తండేల్ రిప‌బ్లిక్ డే ను టార్గెట్ చేస్తే మాత్రం అదే బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే పండ‌గ‌కు రిలీజైన సినిమాల జోరు అప్ప‌టికి త‌గ్గుతుంది. వాటిలో ఏదైనా ఫ్లాపైతే ఆ థియేట‌ర్లు కూడా తండేల్ కు యాడ్ అవుతాయి. వేరే భాష‌ల్లో కూడా పోటీ లేదు కాబ‌ట్టి మంచి ఓపెనింగ్స్ ద‌క్కే ఛాన్సుంటుంది. ఈ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డిన చైతూ, తండేల్ పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :