ASBL Koncept Ambience
facebook whatsapp X

దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం.. ఏపీ స్థానం ఎంత?

దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం.. ఏపీ స్థానం ఎంత?

సాధారణంగా అత్యంత సంపన్నులు ఎవరు అన్న విషయంపై అప్పుడప్పుడు సర్వేలు జరుగుతూ ఉంటాయి. వీటిని దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా.. మరికొన్ని ఈ సందర్భాలలో ఇంటర్నేషనల్ గా కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ప్రస్తుతానికి మన దేశంలో రాష్ట్రాల వారీగా అత్యంత సంపన్న రాష్ట్రం ఏది.. మన రాష్ట్రం ఏ స్థానంలో ఉంది అన్న విషయం మీకు తెలుసా? అయితే ఈ విషయాలు తెలుసుకుందాం పదండి..

మొత్తం మన దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో డబ్బు బాగా ఉన్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. అయితే దేశానికి ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై ఉన్న మహారాష్ట్ర వీటన్నిటికంటే అగ్రస్థానంలో నిలుస్తుంది. మామూలుగా రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి ని మనం జిఎస్డిపి అని పిలుస్తాము. 42.67 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపితో అన్ని రాష్ట్రాల కంటే ఆర్థికంగా టాప్ వన్ లో మహారాష్ట్ర నిలుస్తుంది. ఇక నెక్స్ట్ 31.55 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపితో తమిళనాడు రెండవ స్థానంలో ,28.09 లక్షల కోట్ల జిఎస్డిపితో కర్ణాటక మూడవ స్థానంలో ఉన్నాయి.27.90 లక్షల కోట్లతో గుజరాత్,24.99 లక్షల కోట్ల తో ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. మన పురుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా 16.5 లక్షల కోట్ల జిఎస్డిపితో మనకంటే ముందంజలోనే ఉంది. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే 15.89 లక్షల కోట్ల తో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

సాధారణంగా జిఎస్డిపి ఆ రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులు, వివిధ రంగాలు, అభివృద్ధి, ఉత్పత్తి.. ఇలా ఎన్నో కొలమానాలను తీసుకొని లెక్కించబడుతుంది. మిగిలిన చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే భౌగోళిక పరిస్థితులు, వనరులు.. ఎక్కువగా లభించే ఆంధ్ర ప్రదేశ్కు ఇది ఆశించదగిన నెంబర్ అయితే కాదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకోవడం కాస్త ఆనందమనే చెప్పాలి.  ప్రస్తుతం ఆంధ్రలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగం, సేవారంగం తో పాటు ఇతర రంగాలపై కూడా ఫోకస్ పెట్టింది కాబట్టి రాబోయే కాలంలో మన జిఎస్డిపి మరింత పుంజుకునే అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు అనుకున్నట్లు సాగితే ఏపీ 9వ స్థానం నుంచి మొదటి ఐదు స్థానాలలోకి వెళ్లే ఆస్కారం ఉంది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :