ASBL Koncept Ambience
facebook whatsapp X

"క" సినిమా నుంచి 'మాస్ జాతర' సాంగ్ ప్రోమో విడుదల

"క" సినిమా నుంచి 'మాస్ జాతర' సాంగ్ ప్రోమో విడుదల


యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram ) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క".(KA) ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

"క" సినిమా నుంచి 'మాస్ జాతర' సాంగ్ ను ఈ నెల 7వ తేదీన సాయంత్రం 7.29 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ రోజు ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. జాతరలో కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్ మాస్ స్టెప్స్, భారీ మేకింగ్ ఈ పాట ప్రోమోలో ఆకట్టుకుంటున్నాయి. 'ఆడు ఆడు ఆడు ఆడు నిలువెల్లా పూనకమై ఆడు..ఆడు ఆడు ఆడు ఆడు ఆడు అమ్మోరే మురిసేలా ఆడు..' అనే పల్లవితో సాగే ఈ పాటను సామ్ సీఎస్ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. 'మాస్ జాతర ' సాంగ్ "క" సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానుంది.

"క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :