ASBL Koncept Ambience
facebook whatsapp X

ఈవారం ఓటీటీ లో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

ఈవారం ఓటీటీ లో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

సినిమా హాల్స్ సందడి ఎంత ఉన్న ఇంట్లో కూర్చుని రిలాక్స్డ్ గా ఓటీటీ లో మూవీస్ ని ఎంజాయ్ చేసే సినీ లవర్స్ ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నారు. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలతో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేవారం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న ఆ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లాల్ సలామ్: రజనీకాంత్ ముఖ్యపాత్రలో నటించిన లాల్ సలాం చిత్రాన్ని ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పోర్ట్స్ డ్రామా థియేటర్లో ఊహించిన రెస్పాన్స్ అందుకోలేకపోయింది. సెప్టెంబర్ 20 నుంచి మూవీ సన్ నెక్స్ట్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబడుతుంది. ఓటీటీలో అయినా ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు.

తంగళన్: పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో భారీగా విడుదలైంది. ఇందులో విక్రమ్ నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. బ్రిటిష్ పరిపాలన సమయంలో సాగే ఓ ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ ఎందుకు సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ లవర్స్ ని కూడా ఖుష్ చేయడానికి సెప్టెంబర్ 20న నెట్ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది. ఈ మూవీ తమిళ్లో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.. తెలుగులో కూడా ఈ మూవీ పర్ఫామెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా ఈ చిత్రం సెన్సేషన్ సృష్టిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫారం ఆహాలో రావు రమేష్ నటించిన ఓ మధ్యతరగతి కుటుంబ కథా చిత్రం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయబడుతుంది.

వీటితో పాటుగా ఈ వారం  వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వచ్చే సినిమాలు, సిరీస్ లిస్ట్ తెలుసుకుందాం పదండి..

నెట్‌ఫ్లిక్స్

సెప్టెంబరు 16 -గ్రేవ్‌ టార్చర్‌ (ఇంగ్లిష్‌ మూవీ)
సెప్టెంబరు 17- కలినరీ క్లాస్ వార్స్ (కొరియన్ సిరీస్) 
సెప్టెంబరు 18- ఫాస్ట్‌ ఎక్స్‌ (ఇంగ్లిష్‌)
సెప్టెంబరు 19- ద క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ సిరీస్), ట్విలైట్‌ ఆఫ్‌ ది గాడ్స్‌ ( ఇంగ్లిష్ -వెబ్‌సిరిస్‌), మాన్‌స్టర్స్‌ (వెబ్‌సిరీస్‌) 
సెప్టెంబరు 20 - హిజ్ త్రీ డాటర్స్ (ఇంగ్లిష్ మూవీ).      

అమెజాన్ ప్రైమ్ వీడియో

సెప్టెంబరు 19- ఏ వెరీ రాయల్ స్కాండల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)
సెప్టెంబరు 20- ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు వెబ్ సిరీస్), తలైవేట్టాయామాపాళ్యం (తమిళ వెబ్ సిరీస్) 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :