ASBL Koncept Ambience
facebook whatsapp X

జన చైనాలో తీవ్రమైన జనాభా సంక్షోభం..

జన చైనాలో తీవ్రమైన జనాభా సంక్షోభం..

వన్‌ ఆర్‌ నన్‌.. ఒక్కరు లేక అసలే వద్దు.. ఇదీ.. ఒకప్పటి చైనా జనాభా నిరోధక మంత్రం.. పెరుగుతున్న జనాభాకు అడ్డుకట్ట వేసేందుకు చైనా అనుసరించిన విధానం.. ఇదే.. ఇప్పుడు.. డ్రాగన్‌ కంట్రీకి శాపంగా మారింది. ప్రస్తుతం జనాభా పరంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. స్కూల్స్‌లో చేరే చిన్నారులు తగ్గిపోతుండగా.. వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో మూతపడిన పాఠశాలలను చైనా వృద్ధాశ్రమాలుగా మార్చుతుండడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

డ్రాగన్‌ కంట్రీ చైనా వరుసగా అనేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటోంది. ప్రధానంగా.. రెండు సంక్షోభాలు చైనాను వెంటాడుతున్నాయి. ఒకవైపు బర్త్‌ రేటు, సంతనోత్పత్తి రేటు పడిపోగా.. మరోవైపు.. వృద్ధ జనాభా పెరుగుతూ చైనా భయపెడుతోంది. తాజాగా.. చైనా విద్యాశాఖ రిలీజ్‌ చేసిన ఓ రిపోర్ట్‌ ఆ దేశ సంక్షోభ పరిస్థితులను బహిర్గతం చేస్తోంది. ఇంతకీ.. చైనా విద్యాశాఖ రిపోర్ట్‌లో ఏముంది?… గత కొన్నేళ్లుగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. ఫలితంగా.. ఆ ప్రభావం విద్యతోపాటు అనేక రంగాలపై పడుతోందని చైనా విద్యాశాఖ రిపోర్ట్‌లో వెల్లడికావడం కలవరపెడుతోంది.

జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా వేలాది స్కూల్స్‌ మూసివేసినట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. 2023లో చైనాలో 14,808 కిండర్‌ గార్టెన్లు అంటే.. పాఠశాలలు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తన రిపోర్ట్‌లో తెలిపింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా గతేడాది కంటే 11శాతం తగ్గడమే అందుకు కారణమని పేర్కొంది. 2023లో 5,645 స్కూల్స్‌ మూతపడినట్లు చైనా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. వాస్తవానికి.. చైనా జనాభా వరుసగా రెండో ఏడాది కూడా పడిపోయి ఇటీవల 140కోట్లకు చేరుకుంది.

గతేడాది జననాల సంఖ్య దాదాపు 20 లక్షలు తగ్గినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కన 2023లో చైనాలో 90లక్షల జననాలు రికార్డ్‌ కాగా.. 1949 తర్వాత ఈ రేంజ్‌లో తక్కువ బర్త్‌ రేట్‌ నమోదు కావడం ఇదే తొలిసారి అని ఆ అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే.. జనాభా పరంగా చైనా రెండు ప్రధాన సంక్షోభాలను ఎదుర్కోంటోంది. ఒకవైపు జననాల రేటు తగ్గడం.. అదే సమయంలో సంతానోత్పత్తి మరింతగా పడిపోవడం.. మరోవైపు.. వృద్ధ జనాభా భారీగా పెరిపోతుండడం చైనాను ఇబ్బంది పెడుతున్నాయి. 2023 నాటికి 60ఏళ్లు పైబడినవాళ్ల సంఖ్య 30కోట్లకు చేరుకోగా.. 2035నాటికి ఈ సంఖ్య 40కోట్లకు, 2050నాటికి 50కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఆయా పరిణామాలు కూడా డ్రాగన్‌ కంట్రీకి దడ పుట్టిస్తున్నాయి.

అయితే.. స్కూల్స్‌లో చేరే చిన్నారులు తగ్గిపోతుండగా.. వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో మూతపడిన పాఠశాలలను చైనా వృద్ధాశ్రమాలుగా మార్చుతుండడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. అంతేకాదు.. పెళ్లిళ్లను కూడా సులభతరం చేయాలని, విడాకులు తీసుకోవడాన్ని కఠినతరం చేయాలని కూడా చైనా భావిస్తోంది. మొత్తంగా.. చైనా ఇప్పటికే.. తగ్గిపోతున్న జననాల రేటుతో తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పుడు.. స్కూల్స్‌లో జాయిన్‌ అయ్యే చిన్నారులు లేక పాఠశాలలు మూతపడుతుండడం మరింత ఇబ్బందిగా మారుతోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :