ASBL Koncept Ambience
facebook whatsapp X

Three capitals in AP : మళ్లీ ఏపీలో అభివృద్ధి ముసుగు లో మూడు రాజధానులు.. ఇదే బాబుకి, జగన్ కు మధ్య తేడా..

Three capitals in AP : మళ్లీ ఏపీలో అభివృద్ధి ముసుగు లో మూడు రాజధానులు.. ఇదే బాబుకి, జగన్ కు మధ్య తేడా..

గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రాలో మూడు రాజధానుల (Ap three capitals) కాన్సెప్ట్ ఏ రేంజ్ దుమారం లేపిందో అందరికీ తెలుసు. ఒక్క రాజధానికే దిక్కు లేక మనం ఏడుస్తుంటే మూడు రాజధానులు అవసరమా అని జనం కూడా ఓ రేంజ్ లో ఈ విషయంపై ఫైర్ అయ్యారు. ఉన్న అమరావతిని (Amaravathi) అటకెక్కించి.. జగన్ మూడు రాజధానుల పేరుతో ప్రజలను బాగా కన్ఫ్యూజ్ చేశారు. దీంతో 2024 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు (Chandra Babu) పట్టం కట్టారు.

అమరావతి రైతుల (Amaravathi farmers) ఆర్తనార్ధాలు తీరుస్తాం అంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఓ రేంజ్ లో చంద్రబాబు హామీలు ఇచ్చారు. అఖండమైన మెజారిటీతో ఆంధ్రాలో కూటమి విజయం సాధించింది. ఈ విజయానికి ముఖ్యమైన కారణం మూడు రాజధానులు అనే రాంగ్ కాన్సెప్ట్ అనడంలో డౌట్ లేదు. అయితే అధికారంలోకి వచ్చాక కూడా కూటమి మూడు రాజధానుల పాట వీడుతున్నట్లు కనిపించడం లేదు. అయితే జగన్ (Jagan) మాదిరిగా నిక్కచ్చిగా చెప్పకుండా చంద్రబాబు ఇక్కడ తన మేధస్సు బాగా ఉపయోగిస్తున్నారు.

రాజకీయాలలో అపర చాణక్యుడు చంద్రబాబుకి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని అవతల వాళ్ళ దగ్గర ఒప్పించడం బాగా తెలుసు. అది కూడా ఎవరిని నొప్పించకుండా.. అంతా మీ మంచి కోసమే చేస్తున్నాం అంటూ అభివృద్ధి చూపిస్తూ.. తన మాట నెగ్గించుకోవడం బాబు టైపు రాజకీయం. అందుకే ఆంధ్రకు అమరావతి ఒక్కటే రాజధాని అని చెబుతూనే మరోపక్క మిగిలిన ప్రాంతాల వారు ఎక్కడ అసంతృప్తి చెలరేగకుండా సామాన్య న్యాయం చేస్తాము అంటున్నారు.

తాజాగా ఈ విషయంపై చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఆంధ్రకు ఏకైక రాజధాని అని ఎన్డీయే భావిస్తోంది అని పేర్కొన్న చంద్రబాబు అన్ని రకాలుగా అమరావతిని అభివృద్ధి చేస్తాం అని భరోసా ఇచ్చారు. అయితే మరోపక్క కర్నూలులో హైకోర్టు (Kurnool High court) బెంచిని ఏర్పాటు చేసి అక్కడ ప్రాంతాలను ఇండస్ట్రియల్ హబ్బుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మరోపక్క విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామంటూ చూచాయిగా వెల్లడించారు. ఈ రకంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం వల్ల మూడు ప్రాంతాలలో సమానమైన ప్రగతి సాధిస్తామని.. ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే అంటూ కొత్త కాన్సెప్ట్ ను లేవనెత్తుతున్నారు. 

పాత పచ్చడి కొత్త జాడీలో అందంగా అలంకరించి ఇచ్చినట్టుగా.. మూడు రాజధానుల కాన్సెప్ట్ ని మంచి మసాలాతో చంద్రబాబు ప్రజల మధ్యకు తీసుకురాబోతున్నారు. ఇదిగో ఇక్కడే మనం జగన్ కి.. చంద్రబాబుకి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూడవచ్చు. మూడు రాజధానులు కన్ఫామ్ అన్నట్టు జగన్ మాట్లాడితే.. మీ అభివృద్ధి కోసం.. మీ ప్రాంతాల ప్రగతి కోసం అంటూ బాబు ముచ్చటగా అదే కాన్సెప్ట్ ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి జగన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి..

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :