పుష్ప3లో ఇండియన్ క్రికెటర్
పుష్ప(Pushpa) సినిమాలో ఎర్ర చందనం కూలీగా ఎంతో ఊరమాస్ లుక్ లో అల్లు అర్జున్(Allu ARjun) క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు డైరెక్టర్ సుకుమార్(Sukumar). నలుపు రంగులో, గుబురు గెడ్డం, కొంచెం గూని ఉన్న వాడిలా బన్నీ(Bunny)ని డీ గ్లామరస్ గా చూపిస్తున్నాడని తెలిసి మన ఆడియన్స్ ఆ పాత్రను అంగీకరిస్తారా అని అందరూ అనుమానపడ్డారు.
కానీ ఆ క్యారెక్టర్లో ఉన్న బలం, స్పెషలాటీ నచ్చి లుక్స్ ను పట్టించుకోలేదు ఆడియన్స్. అంతేకాదు ఆ లుక్ తోనే ఎన్నో మేనరిజమ్స్ కూడా వైరలయ్యాయి. తన స్టెప్స్, తగ్గేదేలే మేనరిజమ్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఎంతోమంది క్రీడాకారులు సైతం బన్నీ మేనరిజమ్స్ ను అనుకరించారు.
ఇప్పుడు తాజాగా పుష్ప ఎఫెక్ట్ హైదరాబాదీ యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ(Tilak Varma) పై కూడా పడింది. ఈ మధ్య తిలక్ వర్మ జులపాల జుట్టుతో చాలా స్టైలిష్ గా కినిపిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో అతను వరుసగా రెండు సెంచరీలతో ప్రపంచం మొత్తాన్ని షేక్ చేశాడు. చివరి టీ20 అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav), తిలక్ తో సరదాగా చిట్ చాట్ చేస్తూ తన జుట్టు గురించి అడిగాడు. దానికి తిలక్ వర్మ పుష్పలో బన్నీని చూసే తాను ఇలా జుట్టు పెంచానని, హెయిర్ ఎక్కువగా పెంచుకుని హెల్మెట్ పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉందని చెప్పాడు తిలక్. దానికి సూర్య కుమార్ నువ్వు పుష్ప3(Pushpa3)లో కీ రోల్ చేస్తున్నావట కదా అని జోక్ చేయగా, తనకు క్రికెట్ ఆడటం తప్పించి వేరే ఏమీ తెలియదని, సినిమాల జోలికి వెళ్లనని తిలక్ క్లారిటీ ఇచ్చాడు.