ASBL Koncept Ambience
facebook whatsapp X

తిరుమల ప్రసాదాల్లో జంతువుల కొవ్వు..! చంద్రబాబు తేనెతుట్టెను కదిల్చారా..?

తిరుమల ప్రసాదాల్లో జంతువుల కొవ్వు..! చంద్రబాబు తేనెతుట్టెను కదిల్చారా..?

కోట్లాది మంది హిందువులకు తిరుమల (Tirumala) అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వరుని (Lord Sri Venkateswara) దర్శించుకోవాలని పరతపిస్తుంటారు. అలాగే తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదాన్ని తినాలని ఆరాటపడుతుంటారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలను అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. అందుకే ఎవరు తిరుమల వెళ్లివచ్చినా కాసింతైనా చుట్టుపక్కల వారికి ఇస్తుంటారు. దాన్నే వాళ్లు మహాప్రసాదంగా భావిస్తుంటారు. అంతటి పవిత్రమైన ప్రసాదాల్లో కల్తీ నూనె వాడారని.. ముఖ్యంగా జంతువుల కొవ్వును వాడారని తెలిస్తే ఎంతటి అపచారం..? ఎంత అపవిత్రం..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బుధవారం ప్రెస్ మీట్ లో తిరుమల ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కూడా గత ప్రభుత్వం వాడిందని.. కోట్లాది మంది హిందువుల (Hindus) మనోభావాలను దెబ్బతీశారని కామెంట్ చేశారు. సీఎం సీట్లో కూర్చున్న చంద్రబాబు కాకుండా మరెవరైనా ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే అవి రాజకీయ దురుద్దేశంతో మాట్లాడి ఉండొచ్చని లైట్ తీసుకునేవారు. కానీ ఈ విషయం చెప్పింది స్వయంగా ముఖ్యమంత్రి. దీంతో అందరు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. గత వైసీపీ (YSRCP) ప్రభుత్వం నిజంగా అలాంటి పని చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని.. విచారణకు ఆదేశించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

తిరుమలకు ఎంతోకాలంగా కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నందిని నెయ్యిని (Nandini Ghee) సరఫరా చేస్తూ వచ్చింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక నందిని నెయ్యిని కాదని తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ నెయ్యి కొనుగోలుకు ఆదేశించారు. అయితే ఆ బ్రాండ్ పై అనేక ఆరోపణలున్నాయి. ఆ బ్రాండ్ నెయ్యి కల్తీ అని అంతకుముందు తనిఖీల్లో బయటపడింది. అయినా ఆ నెయ్యిని కొనుగోలు చేయడంపై అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి. అయినా పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం ముందుకెళ్లింది. ఆ తర్వాత తిరుమల ప్రసాదాల్లో నాణ్యత తగ్గిందని పలు సందర్భాల్లో భక్తులు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు.

ఇప్పుడు టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చాక అప్పుడు జరిగిన వ్యవహారాలను ప్రస్తుత పాలకుల దృష్టికి తీసుకొస్తున్నారు అధికారులు. అందులో భాగంగానే అప్పుడు కల్తీ నెయ్యి వాడినట్లు చంద్రబాబు వెల్లడించారు. నాడు జగన్ తీసుకున్న నిర్ణయం హిందువుల మనోబావాలను దెబ్బతీసేలా ఉంది. అందుకే ఇప్పుడు హిందువులంతా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం దీనిపై విచారణ చేపడితే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :