ASBL Koncept Ambience
facebook whatsapp X

నాడు ప్రాణమిత్రులు.. నేడు బద్ధశత్రువులు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరానికి కారణమేంటి..?

నాడు ప్రాణమిత్రులు.. నేడు బద్ధశత్రువులు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరానికి కారణమేంటి..?

ఇజ్రాయెల్ అంతు చూడాలని ఇరాన్.. టెహ్రాన్ ను భస్మీపటలం చేయాలని ఇజ్రాయెల్... పరస్పరం నేరుగా యుద్ధరంగంలోకి అడుగుపెట్టాయి. అంతేకాదు.. ఇజ్రాయెల్ పై ఇరాన్ 180కి పైగా మిస్సైల్స్ కురిపించింది కూడా. ఏముందిలే ఆ రెండు దేశాలకు పడదనుకుంటున్నారా..? కానే కాదు... దశాబ్దాల క్రితం ఆ రెండు దేశాలు ప్రాణసమానులు. జాన్ జిగిరీ దోస్తులు.. ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారాయి. ఇంతకూ ఈ దేశాల మధ్య గొడవలు ఎక్కడ ప్రారంభమయ్యాయి.

ఇరాన్, ఇజ్రాయిల్ ఫ్రెండ్‌షిప్ ప్రారంభం

1960లో ఇజ్రాయెల్... అరబ్ శత్రు పాలనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయం.ఇరాన్, ఇజ్రాయిల్ ఒకే తాటిపై ఉన్నాయి. ఇరాన్ షా మొహమ్మద్ రెజా పహ్లావి ఆధ్వర్యంలో ...ఇరాక్ నాయకత్వాన్ని దాని భద్రత, ప్రాంతీయ ఆశయాలకు ప్రత్యక్ష ముప్పుగా భావించింది. అది ఇరాన్, ఇజ్రాయిల్ సీక్రెట్ ఫ్రెండ్ షిప్ కు దారితీసింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ - ఇరాన్ రహస్య పోలీసులు- రెండు వర్గాలు కలిసి ఇరాకీ పాలనకు వ్యతిరేకంగా కుర్దిష్ తిరుగుబాటుదారులను ప్రోత్సహించారు. కుర్థిష్ తిరుగుబాటుదారులు ఇరాక్ అరబ్ జాతీయవాద నాయకత్వాన్ని, ఇరాక్ ప్రభుత్వాన్ని దేశం లోపల నుండి దెబ్బతీశాయి. ఈ విధంగా ఇరాక్ ను దెబ్బతీయడానికి ఇజ్రాయిల్, ఇరాన్ చేతులు కలిపాయి.

మూడో దేశం వచ్చి చేరడం

ఈ రెండు దేశాలతోపాటు టర్కీ కూడా కలిసి ట్రైడెంట్ అనే త్రైపాక్షిక గూఢచార కూటమిగా ఏర్పడి ఎన్నో విజయాలు సాధించాయి. 1958 నుండి ట్రైడెంట్ ఈ మూడు నాన్ -అరబ్ శక్తులు క్రిటికల్ ఇంటెలిజెన్స్‌ను మార్పిడి చేసుకోవడం, జాయింట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లలో పాల్గొనడం చేసేవి. ఆ తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ మరింత సన్నిహితంగా మారాయి. బలమైన సైనిక, గూఢచార సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో ఒకదానికొకటి సహకరించుకున్నాయి. 1960 మధ్య నాటికి టెహ్రాన్‌లో శాశ్వత ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం ఏర్పడింది. ఇది వాస్తవ రాయబార కార్యాలయంగా పనిచేసింది.

స్నేహం బెడిసికొట్టింది

అరబ్ ప్రపంచం అంతటా విస్తృతంగా వ్యాపించిన ఇజ్రాయెల్ వ్యతిరేక సెంటిమెంట్ గురించి తెలుసుకున్న ఇరాన్ షా.. ఇజ్రాయెల్‌తో ఇరాన్‌కు ఉన్న స్నేహం గురించి జాగ్రత్త వహించాడు. 1967లో ఆరు రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ షా విమర్శలు చేయడం ప్రారంభించాడు. ఇరాన్,ఇరాక్ యుద్ధ సమయంలో.. ఇరాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవం దేశం రాజకీయ లక్ష్యాన్ని తీవ్రంగా మార్చింది. దానిని ఇజ్రాయెల్ వ్యతిరేక ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మార్చింది. 1980,-1988 ఇరాన్,-ఇరాక్ యుద్ధం కొనసాగుతుండగా, సద్దాం హుస్సేన్ సర్కార్ కు వ్యతిరేకంగా కలిసి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఇరు దేశాలు గుర్తించాయి. ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌కు సహాయం చేసే అవకాశాన్ని పొందింది. అమెరికా రష్యా దేశాలు ఇరాక్ కు బలమైన ఆయుధాలు అందించి సహాయం చేశాయి. 1980లో ఇరాన్ కు ఇజ్రాయిల్ ఆయుధాలు కూడా సప్లై చేసింది.

ఇరాన్ కు ఇజ్రాయిల్ సాయం

1980ల మధ్య నాటికి ఇరాన్ కు సైనిక మద్దతు అవసరం తప్పని సరి అయింది. ఇరాన్ -ఇరాక్ యుద్ధంలో ఇరాన్ వనరులు కోల్పోయింది. దాని ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ క్రమంలోనే ఇరాన్ -కాంట్రా వ్యవహారం బయటపడింది.- ఇరాన్ అనుబంధ సంస్థ హిజ్బుల్లాహ్ చేతిలో ఉన్న అమెరికన్ బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం చేసింది. లెబనాన్‌లో ఆయుధాల అమ్మకాలతో కూడిన రహస్యమైన ఒప్పందం జరింగింది.

ఇరాన్ కాంట్రా వ్యవహారం

1990 నాటికి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఫ్రెండ్‌షిప్ పూర్తిగా దెబ్బతింది. ఒకప్పుడు ఆ రెండు దేశాలను ఏకం చేసిన భౌగోళిక రాజకీయ అంశాలు,- అరబ్ సోషలిజం, సోవియట్ ప్రభావం ఇరాక్ శత్రుత్వం అంతమయ్యాయి. విప్లవాత్మక ప్రభుత్వ నియంత్రణలో ఇరాన్ ఉంది. దీంతో ఇజ్రాయెల్ వ్యతిరేక భావజాలాన్ని వ్యక్తం చేసింది. ఇరాన్ ఇప్పుడు హిజ్బుల్లా, హమాస్ వంటి తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోంది.

2000లో ఇరాన్ అధ్యక్షుడిగా మహమూద్ అహ్మదీనెజాద్ ఎన్నికైయాడు. ఆ దశకం నుంచి అతని హోలోకాస్ట్ తిరస్కరణ, ఇజ్రాయెల్‌పై దూకుడు వాక్చాతుర్యం ... ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య మరింత వైరం రేకెత్తించింది. ఇరాన్‌... ఇజ్రాయెల్ ను బద్ద శత్రువుగా మార్చింది. ఇజ్రాయెల్ 2006లో హిజ్బుల్లా, 2008లో హమాస్‌తో యుద్ధాలు చేయడంతో వాటికి ఇరాన్ మద్దతు ఫుల్ గా ఉండేది. ఇరాన్ మద్దతును యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు.- ఇది ఇజ్రాయెల్ వ్యూహాత్మక గణనలలో ప్రధాన ఆందోళనగా మారింది.

2024లో ఇప్పుడు డైరెక్ట్ వార్ ముప్పు !

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పాత ఫ్రెండ్ షిప్ ఇప్పుడు లేదు. రెండు మధ్యప్రాచ్య దేశాలు ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి దిగాయి. గాజాలో హమాస్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మరియు యెమెన్‌లోని హౌతీలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.. ఈ మూడు సాయుధ తీవ్రవాద గ్రూపులు ఇరాన్ 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్'లో భాగంగా పిలుస్తారు....

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :