ASBL Koncept Ambience
facebook whatsapp X

టాలీవుడ్ లో ద‌స‌రా క‌ళ మిస్

టాలీవుడ్ లో ద‌స‌రా క‌ళ మిస్

టాలీవుడ్ లో అతి పెద్ద పండుగ సీజ‌న్ అంటే సంక్రాంతే. ఆ టైమ్ లో మూడు నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పోటీ కూడా భారీగానే ఉంటుంది. సంక్రాంతి త‌ర్వాత పెద్ద సీజ‌న్ అంటే ద‌స‌రానే. ప‌ది రోజుల సెల‌వులున్న ఈ పండ‌గ సీజ‌న్ ను టాలీవుడ్ స‌రిగా వాడుకోవ‌డం లేద‌నే అభిప్రాయాలు వెల్ల‌డ‌వుతున్నాయి.

గత కొన్నేళ్లులో ఉన్నంత సంద‌డి ఈ ఏడాది ద‌స‌రాకు లేదు. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేష‌న్లో వ‌స్తున్న విశ్వం సినిమా, సుహాస్ జ‌న‌క అయితే గ‌న‌క మాత్ర‌మే ఆ సీజ‌న్ కు రానున్నాయి. ఈ రెండు సినిమాల‌కు పెద్ద‌గా క్రేజ్ లేదు. విశ్వం మంచి బ‌జ్ తో రిలీజవుతుంది. జ‌న‌క అయితే గ‌న‌క చిన్న సినిమానే. మొద‌ట్లో సూర్య కంగువ ద‌స‌రాకే వ‌స్తుంద‌నుకున్నారు. కానీ ఇప్పుడా సినిమా వాయిదా ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.

త‌మిళం నుంచి ర‌జినీకాంత్ వేట్ట‌యాన్ మాత్ర‌మే ద‌స‌రాకు రిలీజ‌వుతుంది. వేట్ట‌యాన్ కు తెలుగులో కొంత క్రేజ్ ఉండే మాట నిజ‌మే కానీ మ‌న పెద్ద సినిమాలొస్తే ఆ క్రేజ్ త‌గ్గ‌డం ఖాయం. అవ‌కాశ‌మున్నా టాలీవుడ్ ఈ సీజ‌న్ ను స‌రిగా ఉప‌యోగించుకోలేక‌పోతుంది. ద‌స‌రాను ఖాళీగా వ‌దిలేసి అంద‌రూ డిసెంబ‌ర్ వంక చూస్తున్నారు. ఏదేతేనేం ఈసారి టాలీవుడ్ లో ద‌స‌రా క‌ళ మాత్రం పెద్ద‌గా ఉండేట్లు క‌నిపించ‌డం లేదు.  

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :