ASBL Koncept Ambience
facebook whatsapp X

వైభవంగా టీపాడ్ బతుకమ్మ, దసరా వేడుకలు

వైభవంగా టీపాడ్ బతుకమ్మ, దసరా వేడుకలు

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) నిర్వహించిన సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. డల్లాస్ లోని అల్లెన్ ఈవెంట్ సెంటర్ ఈ వేడుకకు వేదికగా మారింది. అక్టోబర్ 5వ తేదీ జరిగిన ఈ వేడుకలకు వేలాదిమంది హాజరయ్యారు. సుమారు 10 వేల మందికి సరిపోయే ఈ ఇండోర్ స్టేడియానికి మహిళలు బతుకమ్మలతో భారీగా తరలిరావడంతో చివరకు నో ఎంట్రీ అంటూ స్టేడియం నిర్వాహకులు ఫైర్ కోడ్ అలర్ట్ చేశారు. బయటే ఉండిపోయిన సుమారు 5వేల మందికి నిర్వాహకులు అక్కడే బతుకమ్మ ఆడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందాలనటి ప్రియాంకమోహన్ రాకతో ఈ వేడుకకు మరింత శోభ చేకూరింది. సాయంత్రం మహిషాసుర మర్ధిని కార్యక్రమంతో పాటు అలయ్ బలయ్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ షడ్రసోపేతమైన భోజనం ఏర్పాటు చేశారు. చివరగా తెలుగు సినీ నేపథ్య గాయకుడు రామ్ మిరియాల.. రెండున్నర గంటలపాటు లైవ్ కన్సర్ట్  తో అందరినీ ఉర్రూతలూగించారు.

టీపాడ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ కమిటీ చెయిర్ జానకీరాం మందాడి, ప్రెసిడెంట్ రూపా కన్నయ్యగారి, బీవోటీ చెయిర్ బుచ్చిరెడ్డి గోలి, కోఆర్డినేటర్ రవికాంత్ మామిడి నేతృత్వం వహించగా టీపాడ్ బృంద సభ్యులందరూ అలుపెరగని సహకారం అందించారు.

వేడుక అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సినీ కథానాయిక ప్రియాంకమోహన్ ఆశ్చర్యపోయారు. తన జీవితకాలంలో ఇంత పెద్ద పండుగ ఈవెంట్ను చూడలేదని, ఇది తనకు దక్కిన అదృష్టంగా అభివర్ణించారు. అమెరికా గడ్డపై ఇన్ని వేల మంది తెలుగువారి మధ్య పాటలు పాడటం మరిచిపోలేమని, టీపాడ్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని రామ్ మిరియాల బృందం సంతోషం వ్యక్తం చేసింది.

బతుకమ్మ వేడుకల సందర్భంగా అల్లెన సెంటర్ ప్రాంగణంలో జాతరను తలపించేలా దుకాణాలు వెలిశాయి. చీరలు, నగలు, బొమ్మల దుకాణాలు సహా పిల్లలు మారాం చేసి కొనిపించేలా వ్యాపారులు స్టాళ్లు ఏర్పాటు చేశారు. వెరైటీ చిరుతిళ్ల స్టాళ్లు అనేకం వెలిశాయి. దశాబ్దకాలంగా తాము చేపడుతున్న కార్యక్రమాలను ఆదరిస్తున్న తెలుగువారందరికీ టీపాడ్ బృందం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.

 

Click here for Photogallery

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :