ASBL Koncept Ambience
facebook whatsapp X

ఒకే రోజూ - ఒకే పట్టణంలో ఒకే తరహా రెండు పెద్ద వేడుకలు చేయాల్సిన అవసరం ఏముంది?

ఒకే రోజూ - ఒకే పట్టణంలో ఒకే తరహా రెండు పెద్ద వేడుకలు చేయాల్సిన అవసరం ఏముంది?

అమెరికా లో గత 15 సంవత్సరాలుగా పెరుగుతున్న తెలుగు వారి సంఖ్యను బట్టి, పెరుగుతున్న నాయకుల కోరికలు-ఆకాంక్షలు బట్టి అనేక జాతీయ సంఘాలు విడిపోవటం, పట్టణాల్లో కొత్త సంఘాలు ఏర్పడటం సమంజసమే ... ఎక్కువ సంఘాలు ఉండడం వలన వినోద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరిన్ని జరిగే అవకాశం వుంది అని మాట్లాడే వారిలో నేనూ ఒకడిని.

2014 లో డల్లాస్ లో జరిగిన నాటా మహాసభలలో నేను రాసిన " అమెరికాలో తెలుగు సంఘాలు " తానా, ఆటా, నాటా, నాట్స్ నాయకుల సమక్షంలో Dr ప్రేమ్ సాగర్ రెడ్డి గారు విడుదల చేశారు. అప్పటి కి 55 తెలుగు సంఘాలు అని ఆ పుస్తకం లో వివరించాను. అయితే 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అనేక పట్టణాలలో తెలంగాణ తెలుగు సంఘాలు ఏర్పడ్డాయి. వారిని చూసి కొన్ని చోట్ల ఆంధ్ర తెలుగు సంఘాలు కూడా వచ్చాయి. ఇప్పుడు దాదాపు 100 కి పైగా తెలుగు సంఘాలు తెలుగు కమ్మూనిటీ సేవ చేస్తున్నాయి. అంతా మన మంచికే.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏర్పడిన తెలంగాణా తెలుగు సంఘాలలో డల్లాస్ లో TPAD (Telugu People's Association of Dallas) (www.tpadus.org) ఒకటి. ఇది 2015 ఆగష్టు లో రిజిస్టర్ ఏర్పడిన సంస్థ. 501 కి C (3) Organisation గా సర్టిఫై అయిన non profit organisation. అనేక కార్యక్రమాలు చేస్తూ, అతి తక్కువ సమయంలోనే డల్లాస్ లో తెలుగు వారి దగ్గర మంచి పేరు తెచ్చుకోంది. అయితే DATA (Dallas Area Telangana Association) (www.dataus.org) 2010 లో ఏర్పడిన తెలుగు సంస్థ. DATA కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యం గా 9 రోజుల బతుకమ్మ పండుగ చేస్తూ మంచి పేరు తెచ్చుకోంది. డల్లాస్ నగరం లో ఈ మధ్య కాలంలో తెలుగు వారి సమాఖ్య బాగా పెరిగిన మాట నిజమే.. డల్లాస్ ని డాల్లస్ పురం అంటూ సోషల్ మీడియా లో పోస్టింగ్స్ రావటం కూడా చూసాము.

కానీ ఈ సంవత్సరం అక్టోబర్ 5 వ తేదీన DATA వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ, దసరా పండుగ ను చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ వేడుక ను చాలా పెద్దది గా చేయటానికి అవసరం అయిన స్పాన్సర్లు, డోనార్స్ ని రెడీ చేసుకొని, సినీ నేపధ్య గాయకులూ హరిత నారాయణ్, ధనుంజయ్ లతో సంగీత విభావరి ని ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ప్రకటించింది.

అదే రోజున ( శనివారం, అక్టోబర్ 5 ) TPAD వారు కూడా ఈ సంవత్సరపు బతుకమ్మ - దసరా సంబరాల పండుగ ని ప్రకటించారు. ఈ వేడుక కోసం TPAD కూడా అనేక కార్యక్రమాలు రూపొందించింది. ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల సంగీత విభావరి కూడా పెట్టింది. భారీ ఎత్తున చేస్తున్న ఏర్పాట్లు కి తగ్గట్టు గా అనేక మంది పని చేస్తూ కావలిసిన స్పాన్సర్స్, డోనార్స్ ని సమాయత్తం చేసుకొంటున్నారు.

ఈ విధం గా రెండు సంఘాల వారు ఒక కార్యక్రమాన్ని ఒకే రోజున చేయాలనుకోవడం పొరపాటు గా జరిగిందా? పోటీ గా జరిగిందా? అని డల్లాస్ తెలుగు వారు ఆశ్చర్య పోతున్నారు. బాధ పడుతున్నారు. ఇది వరకు San Jose లో ఒక సారి అక్కడి రెండు తెలుగు సంఘాలు (BATA & SIliconandhra ) ఒకే రోజు న ఉగాది కార్యక్రమం జరిపినప్పుడు కూడా నేను ( తెలుగు టైమ్స్ ) ఇది మంచి పద్దతి కాదు, సంఘాల మధ్య ఆరోగ్య కరమైన, స్నేహ పూరితమైన అవగాహన ఉండాలి అని చెప్పాను ( రాసాను). ఇప్పుడు డల్లాస్ లో కూడా ఇరు వర్గాల వారు తెలుగు కమ్యూనిటీ ని ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున తమ వేడుకకు రావాల్సింది అని ప్రమోషన్ చేస్తున్నారు. ప్రకటనలు ఇస్తున్నారు. ఇమెయిల్, వాట్సాప్ కాంపెయిన్ లు చేస్తున్నారు.

"రెండు సంఘాల వారు తెలుససిన వారే. రెండింటి లోనే స్నేహితులు వున్నారు. ఎవరి వేడుక కు వెళ్ళాలో అర్ధం కావటం లేదు" అని అనేక మంది అనుకోవడం జరుగుతోంది. తెలుగు టైమ్స్ కూడా రెండూ సంఘాల వారి వార్తలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ ఇరు సంఘాల వారితో స్నేహం గానే వుంది. ఉంటుంది. కానీ ఇది తప్పు అని చెప్పటం తెలుగు టైమ్స్ బాధ్యత. డల్లాస్ లోని పెద్దలు ఇప్పటికయినా ఇరు వర్గాల వారిని పిలిచి ఒక వేడుక ను మార్చే ప్రయత్నం చేస్తే బావుంటుంది.


-వేంకట సుబ్బారావు చెన్నూరి, ఎడిటర్ - తెలుగు టైమ్స్

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :