ASBL Koncept Ambience
facebook whatsapp X

ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహణ


ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహణ


మారిస్‌విల్, NC – ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలు అద్భుతంగా ముగిశాయి. ఈ సంబరాలకు 6,000-7,000 మంది పాల్గొనడం విశేషం. భారీస్థాయిలో నిర్వహించిన ఈకార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వైభవం విశ్వవ్యాప్తంగా ప్రదర్శితమైంది.


25 అడుగుల ఎత్తైన కమలపీఠం బతుకమ్మల అందంతో అలరించింది. అష్టలక్ష్మి అలంకరణలు కార్యక్రమానికి పవిత్రతను తీసుకువచ్చాయి. గంటలపాటు నిరాటంకంగా జరిగిన బతుకమ్మ నృత్యం కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ ఉత్సవానికి రెండునెలలపాటు కఠినసాధన చేసి బతుకమ్మ ప్రదర్శనను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.

ఈ కార్యక్రమంలో సెనేటర్ జేజే చౌదరి, మారిస్‌  విల్మేయర్ టిజే కౌలీ, మేయర్ ప్రొటెం సతీష్ గరిమెల్ల, కౌన్సిల్ సభ్యులు లిజి జాన్సన్, స్టీవ్రావు, కేరీ టౌన్ కౌన్సిల్ సభ్యురాలు సరికా బన్సాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.



ఈ కార్యక్రమం స్థానికులు మాత్రమే కాకుండా ఉత్తరకరోలినా అంతటినుంచి మరియు ఇతరరాష్ట్రాల నుంచి వచ్చిన భారతీయ సముదాయం కూడా పెద్దసంఖ్యలో ఆకర్షించింది. స్థానిక వ్యాపార ప్రతినిధులు మరియు ఐటీ డైరెక్టర్లు, అంతేకాకుండా డెల్టాకంపెనీ ఐటీ డైరెక్టర్ స్టెఫనీ షైన్ పాల్గొనడం, ఈ ఉత్సవానికి వ్యాపారరంగం మరియు ప్రొఫెషనల్స్ నుంచి కూడా మద్దతు ఉందని సూచిస్తుంది.

ఈ భారీ ప్రోగ్రాంలో 7000 మందికు భోజనం, స్నాక్స్ వడ్డించారు. అతిథుల సౌకర్యార్థం శాటిలైట్ పార్కింగ్ నుండి స్టేడియం వరకు రవాణాసౌకర్యం అందించారు. ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి  TTGA నాయుకత్వంలో రెండునెలలు ప్రణాళికా సూత్రాలను అమలుచేశారు.

ఇవ్వాళ్టి ప్రత్యేకత బతుకమ్మ కోసం ప్రత్యేక పాట సృష్టించడం. ఈపాట వేడుకకు మరింత ఆభరణమైంది. ఈ కార్యక్రమం TTGA అధ్యక్షుడు మహిపాల్‌ రెడ్డి, ఉపాధ్యక్షురాలు భారతివెంకన్నగారి, ఈవెంట్ డైరెక్టర్ శశాంక్ ఉండీల, సాంస్కృతిక డైరెక్టర్ పూర్ణ అల్లె, యువత డైరెక్టర్ శ్రీకాంత్ మంద గంటి, ఫెసిలిటీ డైరెక్టర్ రఘు యాదవ్, ఫుడ్ డైరెక్టర్ మహేష్ రెడ్డి, కోశాధికారి రవిఎం, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ స్వాతి గోలపల్లి, కమ్యూనికేషన్ డైరెక్టర్ మాధవి కజా నాయకత్వంలో విజయవంతంగా సాగింది.

ఈ బతుకమ్మవేడుకలు ఉభయతెలుగురాష్ట్రాల ప్రజల సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటించడంతో పాటు, ఉత్తరకరోలినాలో భారతసాంస్కృతిక ఉత్సవాల పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. TTGA ఈఉత్సవాల ద్వారా సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తూ విజయవంతంగా ముందుకు సాగుతుంది.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :