ASBL Koncept Ambience
facebook whatsapp X

సిక్కు ఓట్లకోసం.. ఖలిస్తానీ రాగం..

సిక్కు ఓట్లకోసం.. ఖలిస్తానీ రాగం..

కెనడాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న లిబరల్ పార్టీ క్రమంగా పట్టుకోల్పోతోంది. ముఖ్యంగా 2015లో అధికారంలోకి వచ్చిన ట్రూడో సర్కార్.. ప్రజా వ్యతిరేక విధానాలతో పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది. 2017లో అఘాఖాన్ సంస్థనుంచి బహుమతులు, 2019లో ఎస్ఎన్సీ లవ్ లిన్ స్కాండిల్, బ్లాక్ ఫేస్ వివాదం.. ట్రూడో ప్రతిష్టను దారుణంగా దెబ్బతీశాయి. 2019లో ఆపార్టీ బలం పూర్తిగా తగ్గిపోవడంతో మిత్రపక్షంపై ఆధారపడాల్సి వచ్చింది. తర్వాత ఆర్థికమంత్రి బిల్ తో వివాదం.. తీవ్ర రూపు దాల్చింది. ఫలితంగా బిల్ రిజైన్ చేశారు కూడా. 2021లో ఎన్నికలకు వెళ్లిన ట్రూడోకు మరోసారి.. బొటాబొటి మెజార్టీ దక్కింది.దీంతో మళ్లీ మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

దీంతో క్రమంగా సొంతపార్టీలోనే ట్రూడోకు మద్దతు కరవైంది. ట్రూడో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారని.. ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తే ఓటమి తప్పదని లిబరల్ పార్టీ నేతలు సైతం భావిస్తున్నారు. పార్లమెంటు హాల్లో రెండురోజుల క్రితం స్వపక్ష పార్టీ ఎంపీలు సంతకాల సేకరణ చేపట్టినట్లు సమాచారం. ఇందులో అధికశాతం ఎంపీలు పాల్గొన్నట్లు ఓకెనడియన్ పత్రిక వెల్లడించింది.ఇలాంటి తరుణంలో పార్టీని, దేశం దృష్టిని ఆకర్షించే పెనువివాదం కావాలి. ఈ పరిణామాలతో మరోసారి నిజ్జర్ హత్యకేసును తిరగదోడుతున్నారు ట్రూడో. కెనడాలోని సిక్కుల భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన భారత్ ఏజెంట్లను తాము కఠినంగా ఎదుర్కొన్నామన్న ఇమేజ్ కోసం.. తెగ తాపత్రయ పడుతున్నారు ట్రూడో.

దేశప్రధానిగా ట్రూడో ఆదరణ క్రమంగా పడిపోతోంది. ఆదేశ విపక్షనేత కన్నా ఏకంగా 19 శాతం ఓట్ల ఆదరణ తగ్గింది. విపక్ష కన్జర్వేటివ్ నేత పెర్రీ వోయిలివ్రే .. ఈసారి అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాలున్నాయి. జులైలో జరగనున్న ఎన్నికల్లో ట్రూడో సర్కార్ పతనం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. దీనికో తోడు న్యూడెమొక్రాటిక్ పార్టీ సైతం.. తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గత నెల్లో ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య ట్రూడో మరోసారి ఖలిస్తాన్ అనుకూల వాదులకు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది.

కెనడాలో దాదాపు 8 లక్షల మంది సిక్కులున్నారు. ఆ దేశంలో నాలుగో అతిపెద్ద ఓటర్లుగా ఉన్న సిక్కుల ఓట్ల కోసం .. జస్టిన్ ట్రూడో చాలా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా భారత్ తో వివాదాన్ని పెద్దదిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోనే అదిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో సంబంధాలను సైతం కట్ చేసుకునే పరిస్థితి కల్పించారు.అంతే కాదు పంజాబ్ మంత్రి హత్యకు కుట్రపన్నిన జస్పాల్ అత్వాల్ ను.. 2018లో ట్రూడో భారత పర్యటన సందర్భంగా హైకమిషనర్ డిన్నర్ కు ఆహ్వానించారు.2023 జి20 సదస్సు నుంచి ట్రూడో.. నిజ్జర హత్య కేసును ప్రధానంగా ప్రస్తావిస్తూ.. భారత్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :