ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికా ఇంధన మంత్రిగా క్రిస్‌ రైట్‌

అమెరికా ఇంధన మంత్రిగా క్రిస్‌ రైట్‌

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ తన మంత్రివర్గాన్ని, అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని పనిలో నిమగ్నమయ్యారు. అమెరికా ఇంధన శాఖ మంత్రిగా క్రిస్‌ రైట్‌ను నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్‌నకు క్రిస్‌ రైట్‌ భారీగా విరాళాలు అందజేశారు. ఆయన ప్రచారానికి సహకరించారు. డెన్వర్‌లోని లిబర్టీ ఎనర్జీ అనే సంస్థకు క్రిస్‌ రైట్‌ సీఈఓగా పని చేస్తున్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆయన ప్రోత్సహిస్తుంటారు. చమురు, గ్యాస్‌ ఉత్పత్తికి గట్టి మద్దతుదారుడు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటలాలకు ఆయన వ్యతిరేకిస్తున్నారు.  కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ప్రపంచమంతా శిలాజేతర ఇంధన వనరుల వైపు పరుగులు తీస్తుండగా, ట్రంప్‌ మాత్రం శిలాజ ఇంధనాలకే ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం.  

ఇంధన మంత్రిగా క్రిసరైట్‌ను నియమించడంతో అమెరికా శిలాజ ఇంధనాల వాడకం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే శిలాజ ఇంధనాల వాడకం మరింత పెరగాలని క్రిస్‌ రైట్‌ వాదిస్తున్నారు. ఆయన గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వలో పనిచేసిన అనుభవం ఆయనకు లేదు. క్రిస్‌ రైట్‌ను ఇంధన శాఖ మంత్రిగా ట్రంప్‌ నియమించడం వెనుక అమెరికాలోని చమురు లాబీ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :