ఎవరీ జనరల్ కీత్ కెల్లాగ్.. ? ట్రంప్ వార్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి?
డోనాల్డ్ ట్రంప్ ...రిటైర్డ్ జనరల్ కీత్ కెల్లాగ్‌ను ఉక్రెయిన్ - రష్యాకు ప్రత్యేక రాయబారిగా నియమించారు, ఇది సంఘర్షణను తగ్గించేందుకు అమెరికా తీసుకున్న ఓ కీలకచర్యగా భావించవచ్చు. యుద్ధరంగంలో సుదీర్గ అనుభవం కలిగిన కీత్ .. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడంలో సహకరించగలరని ట్రంప్ గట్టి ఆశలే పెట్టుకున్నారు. ఆదిశగా అడుగులు కూడా పడనున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ కు అమెరికా సైనిక మద్దతు తగ్గించడం, అదే సమయంలో పుతిన్ కు పరోక్ష వార్నింగ్ ద్వారా సమస్యను పరిష్కరించాలన్నది ట్రంప్ భావనగా కనిపిస్తోంది.
కీత్ కెల్లాగ్ ఎవరు?
గతంలో వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ యొక్క జాతీయ భద్రతా సలహాదారుగా కెల్లాగ్ పనిచేశారు , అంతేకాదు..ట్రంప్ పాలనలో సమర్థవంతమైన పాత్రను పోషించారు. ఆసమయంలో కెల్లాగ్ వ్యవహారశైలి ట్రంప్ కు బాగా నచ్చింది. దీనికి తోడు అమెరికా ఫస్ట్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌తో వ్రాసిన రచనలలో, చర్చలు పురోగమిస్తే మద్దతునిస్తూనే, ఆయుధాల సరఫరాను నిలిపివేస్తామని బెదిరించడం ద్వారా చర్చలకు ఉక్రెయిన్‌ను ప్రోత్సహించాలని కెల్లాగ్ ప్రతిపాదించారు.
ఇక రష్యాను చర్చల దిశగా మరల్చడాన్ని సైతం ప్రస్తావించారు కెల్లాగ్. దీనిలో భాగంగా రష్యా చర్చలకు అంగీకరించాలని లేకుంటే, ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం అందుతుందన్న విషయాన్ని క్రెమ్లిన్ కు అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నది ఆయన ప్రతిపాదనగా ఉంది.దీనికి తోడు రష్యాకు "పరిమిత ఆంక్షల ఉపశమనం" అందించాలని సూచించినట్లు తెలుస్తోంది.
బిడెన్ యొక్క విధానంపై విమర్శలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య సంఘర్షణను పెంచడానికి బిడెన్ యొక్క "అస్తవ్యస్తమైన విదేశాంగ విధానం" దోహద పడిందని కెల్లాగా గతంలో ఆరోపించారు.బిడెన్ ఎత్తుగడలు, ఉక్రెయిన్ రుణంలో $5 బిలియన్లను మాఫీ చేయడం మరియు సుదూర క్షిపణులను సరఫరా చేయడం వంటివాటిపై ప్రశంసలు, విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా క్షిపణీ రవాణ ఆలస్యం చేయడంపై బైడెన్ విధానాన్ని తప్పుపట్టారు కెల్లాగ్.
దౌత్య వ్యూహం vs. సైనిక మద్దతు
కెల్లాగ్ నియామకం ఉక్రెయిన్‌లో U.S. ప్రమేయంపై విస్తృత చర్చకు తెరలేపింది. బైడెన్ సహాయాన్ని పెంచినప్పటికీ, ట్రంప్ మరియు కెల్లాగ్ దౌత్యానికి ప్రాధాన్యతనిస్తూ మరింత వ్యూహాత్మక విధానం కోసం వాదించారు.
యుద్ధరంగంలో అపార అనుభవం, దౌత్యాంలోనూ ప్రవీణుడు..
కెల్లాగ్ యొక్క సైనిక జీవితం వియత్నాంలో ప్రారంభమైంది, ఆ సమయంలో వ్యూహాలు, పరాక్రమానికి గానూ అమెరికా సైన్యం నుంచి పురస్కారాన్ని సైతం పొందారు. 2003లో పదవీ విరమణ చేసిన తర్వాత, అతను ఒరాకిల్ మరియు CACI ఇంటర్నేషనల్‌లో కీలక స్థానాలను అధిరోహించారు. తాజా పోస్టింగ్ పై సానుకూలంగా స్పందించారు కెల్లాగ్. "అధ్యక్షుడు ట్రంప్ కోసం పనిచేయడం నా జీవితంలో లభించిన ప్రత్యేకత, బలం ద్వారా శాంతిని పొందాలని నేను ఎదురు చూస్తున్నాను" అని ఆయన రాశారు.