అమెరికా ఆరోగ్య మంత్రిగా... రాబర్ట్ ఎఫ్ కెన్నడీ
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నియామకాల జోరు కొనసాగిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు కాబోయే తన ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌ను నామినేట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆరోగ్యం, మానవ సేవల మంత్రిత్వ శాఖ అధిపతిగా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ పేరు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆయన శాస్త్రీయ పరిశోధనల్లో ప్రమాణాలను పెంచి, ఆరోగ్య విభాగాల్లో పారదర్శకత తీసుకొస్తారని విశ్వసిస్తున్నా. దీర్ఘకాలిక వ్యాధుల వ్యాప్తిని అరికట్టి అమెరికా మళ్లీ ఆరోగ్యకర దేశంగా మారుస్తారని నమ్మకంగా ఉన్నా అని ట్రంప్ పేర్కొన్నారు.
Tags :