అమెరికా వ్యవసాయ మంత్రిగా బ్రుక్ రోలిన్స్
చిరకాల మిత్రురాలు బ్రూక్ రోలిన్స్‌ను అమెరికా వ్యవసాయ మంత్రిగా డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. రిపబ్లికన్ల థింక్ టాంక్ అమెరికా ఫస్ట్పాలసీ ఇనిస్టిట్యూట్ అధిపతిగా ఉన్న బ్రూక్ నియామకంతో కేబినెట్ జాబితా దాదాపు పూర్తయింది. దేశానికి నిజమైన వెన్నెముక అయిన అమెరికా రైతులను రక్షించేందుకు బ్రూక్ నాయకత్వం వహిస్తారని ఆయన తెలిపారు. అమెరికా ఫస్ట్ అధ్యక్షురాలిగా ఉన్న బ్రూక్స్ ట్రంప్ మిత్రురాలు. ట్రంప్ తొలి పర్యాయంలో వైట్‌హౌస్ సహాయకురాలిగా పని చేశారు. ఆఫీస్ ఆఫ్ అమెరికన్ ఇన్నోవేషన్ డైరెక్టర్‌గా, డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేశారు. వ్యవసాయ అనుబంధ కుటుంబం నుంచి వచ్చిన రోలిన్స్ దేశవ్యాప్త వ్యవసాయ క్లబ్ అయిన 4హెచ్‌తో పాటు ప్యూచర్ ఫార్మర్స్ ఆఫ్ అమెరికాతోనూ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.
టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్ డిగ్రీ అందుకున్న ఆమె తరువాత న్యాయవాదిగానూ పని చేశారు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని పున సమీక్షించడంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు. రోలిన్స్ ఎంపిక దాదాపు పూర్తయ్యింది. ప్రతి అభ్యర్థిని సెనేట్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. 15 మంది సలహాదారుల బృందం అమెరికన్ ప్రభుత్వంలో ఒక బ్యూరోక్రటిక్ విభాగానికి నాయకత్వం వహిస్తుంది.