ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ..దీపావళి సందర్భంగా

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ..దీపావళి సందర్భంగా

దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం కరువు భత్యం ( డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు. 2022 జులై ఒకటి నుంచి 2024 అక్టోబర్‌ 31వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయనున్నారు. 2025 మార్చి 31వ తేదీ లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సీపీఎస్‌ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్‌ ఖాతాకు జమ చేస్తారు. 90 శాతం 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నారు. జీపీఎఫ్‌ ఖాతాలు లేని ఫుల్‌ టైం కంటింజెంట్‌ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నారు. జీపీఎఫ్‌ ఖాతాలు లేని ఫుల్‌ టైం కంటింజెంట్‌ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేపడతారు. విశ్రాంత ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :