ASBL Koncept Ambience
facebook whatsapp X

న్యూజెర్సిలో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు

న్యూజెర్సిలో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధమైన బతుకమ్మ ఉత్సవాన్ని దసరా నవరాత్రి రోజులలో మహిళలు గర్వంగా జరుపుకుంటారు. తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టిటిఎ) స్థాపించబడినప్పటి నుండి, అమెరికా మొత్తంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది.

వేలాది మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలుఈ వేడుకల్లో పాల్గొని, తమ సంప్రదాయాన్ని చాటుకుంటూ ఉంటారు. టిటిఎ స్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి వారి ఆశీర్వాదంతో, టిటిఎ సలహా అధ్యక్షులు డా. విజయపాల్‌ రెడ్డి, కో-అధ్యక్షులు డా. మోహన్‌ రెడ్డి పట్లోళ్ళ, సభ్యుడు భరత్‌ మాదాడి వారి మద్దతుతో, టిటిఎ అధ్యక్షులు వంశీ రెడ్డి, అధ్యక్షులుగా ఎన్నికైన నవీన్‌ రెడ్డి మలిపెడ్డి ప్రధాన కార్యదర్శి మరియు అమెరికా అంతటా బతుకమ్మ సలహాదారు కవిత రెడ్డి వారి నాయకత్వంలో ఈ ఏడాది అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో బతుకమ్మ ఉత్సవాలను వేడుకల నిర్వహిస్తున్నారు.

టిటిఎ అడ్వైసరీ కో చైర్‌ మోహన్‌ రెడ్డి పట్లోళ్ల  స్వంత రాష్టం న్యూజెర్సీ లో బతుకమ్మ సంబరాలు మిన్ను ముట్టాయి. టిటిఎ జాయింట్‌ సెక్రటరీ శివారెడ్డి కొల్ల మరియు బోర్డు అఫ్‌ డైరెక్టర్స్‌ సుధాకర్‌ ఉప్పల, నర్సింహ పెరుక, నరేందర్‌ యారవ నేతృత్వంలో, న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌, ఎడిసన్‌ నగరంలో శనివారం, అక్టోబర్‌ 5, 2024 న నిర్వహించిన సంబరాలు 5000 మందికి పైగా ఆహుతులతో కిక్కిరిసింది.

టిటిఎ న్యూజెర్సీ రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ మధుకర్‌ రెడ్డి, సాయి గుండూర్‌, కోర్‌ కమిటీ సభ్యులు అరుణ్‌ ఆర్కాల, దీప జలగం, రాజా నీలం, ప్రశాంత్‌ నలుబంధు, శంకర్‌ రెడ్డి వులుపుల, శ్రీనివాస్‌ రెడ్డి మాలి, నవీన్‌ కౌలూరు, నవీన్‌ యలమండల, శ్రీనివాస్‌ జక్కిరెడ్డి, వెంకీ నీల, విష్ణు రెడ్డి, రఘువీర్‌ పి., శివ నారా, బాల గణేష్‌, సాయిరామ్‌ గాజుల, ప్రణీత్‌ నల్లపాటి మరియు ఎందరో స్వచ్చంద సేవకులు ఈ వేడుకల విజయవంతానికి తమవంతు కృషి చేసారు. ఉదయం 11 గంటలకు సందడి మొదలయ్యింది. డప్పు చప్పుళ్లతో బతుకమ్మలకు ఘనమైన స్వాగతం లభించింది. ఈ సంబారాలకు 200 పైగా బతుకమ్మలు తీసుకొని వచ్చారు న్యూ జర్సీ వాసులు. సాయి దత్త పీఠంకు చెందిన పురోహితులు భాస్కర శర్మ గారు, టిటిఎ కార్యవర్గంతో గౌరి దేవి పూజ చేయించి బతుకమ్మ పండగను ఆరంభించారు. కమిటీ సభ్యులందరూ ఈ పూజలో పాల్గొన్నారు. ప్రాంతీయ గాయని గాయకులు డా. మధు దౌలపల్లి గారు, బ్రాహ్మిణి వనమ తమ మధుర గానంతో అలరింపజేశారు. శ్వేత కొమ్మొజీ కార్యక్రమానికి వ్యాఖ్యాత వ్యవహరించడమే కాకుండా అందరితో బతుకమ్మ లాడుతూ మహిళలను మరింత ఉత్తేజ పరిచారు. 

తెలంగాణ నుండి విచ్చేసిన ప్రముఖ జానపద కళాకారుడు శ్రీ బిక్షు నాయక్‌ మహిళలందరికీ మార్గదర్శకం చేస్తూ, తన ఆట పాటలతో అందరినీ ఉత్సాహ పరుస్తూ, బతుకమ్మ ఆడిరచారు. చక్కగా అలంకరించుకొని, వేలాది మహిళలు, అమ్మాయిలు చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడడం లయ విన్యాసం అమోఘం అపూర్వం. వర్ణించడానికి మాటలు సరిపోని ఒక అనిర్వచనీయమైన అనుభూతి పొందారు.

12 అడుగుల ఎత్తైన అద్భుతమైన బతుకమ్మ ఈ సంబరాలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమణ, శ్రీమతి దీప జలగం, నరసింహా పెరుక మరియు వాలంటీర్లు ఈ బతుకమ్మ తయారీకి సహాయం చేశారు. వివిధ స్థానిక మరియు జాతీయ సంస్థలు టిఫాస్‌, ఆటా, తానా, నాట్స్‌, నాటా, టిడిఎఫ్‌ నుండి పలువురు ప్రముఖులు విచ్చేసి ఈ సంబరాలలో తాము ఒక భాగం అయ్యారు. సుధాకర్‌ ఉప్పల గారు, శివా రెడ్డి గారు వీరందిరినీ వేదిక మీదికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన కార్యావర్గాన్ని సభికులకు పరిచయం చేసారు. జాయ్‌ అలుక్కాస్‌ మరియు శ్వేతారావు వారి అంజనీ డిజైనర్స్‌ వారు చక్కగా పేర్చిన బతుకమ్మలకు విలువైన బహుమతులు అందజేసారు. మాయా ఫైన్‌ జూవ్వెల్స్‌ వారు చక్కగా అలంకరించుకొన్న మహిళలకు బహుమతులు అందజేసారు. మలబార్‌ గోల్డ్‌ డైమండ్స్‌ వారు రాఫిల్‌ ప్రైజ్‌లు అందజేసారు. అలాగే స్పార్కిల్స్‌ బై స్వాతి డిజైన్స్‌ వారు బహుమతులు ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి న్యూ జెర్సీ కి చెందిన స్థానిక నాయకులు, ప్రముఖులు విచ్చేసి అందరికీ తమ అభినందనలు, శుభాకాంక్షలు అందజేసారు. ముఖ్యులు నర్సింహా రెడ్డి దొంతిరెడ్డి రెడ్డి గారు, సురేశ్‌ రెడ్డి వెంకన్నగారి, ప్రసాద్‌ కునారపు, పవన్‌ రవ్వ, కిరణ్‌ గూడూరు ఈ సంబరాలకు రావడం సంతోషకరం. వచ్చిన ప్రముఖులలో కొందరు అజయ్‌ పాటిల్‌  మరియు సామ్‌ థామ్సన్‌ గార్లు తమ శుభాకాంక్షలు అందజేసారు. అందరికీ జ్ఞాపికలు అందజేసారు. నరేందర్‌ యారవ గారి ఆధ్వర్యంలో బతుకమ్మల నిమజ్జనం ఘనంగా జరిగినది. న్యూ జెర్సీ టీం సభ్యులు మరియు పలువురు (ముఖ్యంగా యువత) ఈ బతుకమ్మ పండగ ఘనంగా జరగడానికి కృషి చేశారు. వస్త్రాలు, నగలు మరియు ఇతర విక్రేతలు తమ తమ స్టాల్స్‌ తో వచ్చిన వారికి షాపింగ్‌ సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి తోడ్పడిన స్వచ్చంద సేవకులందరికీ, ధన సహాయం చేసిన దాతలకు, చక్కగా బతుకమ్మలను చేసిన మహిళలకు, మీడియాకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :