మాజీ మంత్రి రోజాకు షాక్ ఇచ్చిన టీటీడీ ఛైర్మన్..
2024 ఎన్నికలకు ముందు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించిన ఆర్కే రోజాకు టీటీడీ పాలకమండలి తాజాగా షాక్ ఇచ్చింది. ఏపీ టూరిజం శాఖ మంత్రిగా రోజా వ్యవహరిస్తున్న సమయంలో శ్రీవారి దర్శనం టూరిజం టికెట్లను విషయంలో అవకతవకలు జరిగాయని పాలకమండలి ఆ టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో శ్రీవారి దర్శనం కోసం ఉపయోగించే టికెట్ల పేరుతో టూరిజం శాఖలో సుమారు 400 కోట్లకు పైగా స్కాం జరిగినట్టు తిరుపతి జనసేన నేత రాయల్ ఆరోపించారు. అంతేకాదు శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో టూర్ ప్యాకేజీ కోసం గతంలో 24 బస్సులకు పర్మిషన్ ఇవ్వగా.. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బస్సులు తిరిగినట్టు విమర్శలు ఉన్నాయి.
ఈ టికెట్టు కేటాయింపు విషయాలపై అధిక సంఖ్యలో గతంలో విమర్శలు వచ్చాయి. అందుకే దీనిపై పాలకమండలి తీవ్రంగా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు టూరిజం శాఖ టికెట్ల ద్వారా గతంలో జరిగిన అవకతవకలు తమ దృష్టికి వచ్చాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే టూరిజం శాఖ ద్వారా హోటల్ నిర్మాణానికి అనుమతి పొందిన ముంతాజ్ హోటల్ భూములను సైతం రద్దు చేస్తున్నట్లు పాలకమండలి నిర్ణయం తీసుకుంది.
ఏపీ టూరిజంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి అన్న విషయంపై గతంలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి విజిలెన్స్ అధికారులు నిర్ధారించారని.. ఆ నివేదికల ఆధారంగానే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు. తొలిసారి చైర్మన్గా పాలకమండలి సమావేశాన్ని నిర్వహించిన బీఆర్ నాయుడు ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రోజా తరచుగా తిరుమల దర్శనానికి వచ్చిన సంగతుల కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటి వెనక కూడా రోజా ఏదో ఒక లావాదేవీలు పెట్టుకునే ఉంటుంది అని కొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి రోజా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల విషయంలో భారీగా ట్రోల్ అవుతోంది.