ASBL NSL Infratech

సునాక్ సర్కార్ కు మూడినట్లేనా...?

సునాక్ సర్కార్ కు మూడినట్లేనా...?

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది.జులై 4న పోలింగ్‌ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. చివరి రోజు అనేక ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేసిన ప్రధాన మంత్రి రిషి సునాక్‌.. పశ్చాత్తపపడే పని చేయవద్దని ఓటర్లకు సూచించారు. ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి గెలుపు అవకాశాలున్నాయని మెజార్టీ సర్వేలు చెబుతున్న వేళ రిషి సునాక్‌ ఈ విధంగా పిలుపునిచ్చారు.

‘‘సర్వేలు చెప్పిన విషయాన్ని విశ్వసించి, ఒకవేళ లేబర్‌ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని భావిస్తే.. దేశం మొత్తం పన్నుల భారం మోయక తప్పదని హెచ్చరించారు.నేను ఇదే పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నా. తద్వారా ప్రజల పన్నులు, వారి పెన్షన్లలతో పాటు సరిహద్దులను రక్షిస్తా. మీరు తీసుకునే నిర్ణయం మళ్లీ వెనక్కి రాదు. పశ్చాత్తాప పడే పని చేయకండి’’ అని రిషి సునాక్‌ పేర్కొన్నారు. లేబర్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతిఒక్కరిపై పన్నుల భారం మోపుతుందన్న ఆయన.. అందుకు అడ్డుకట్ట వేసేందుకు ఓటర్ల వద్ద కొన్ని గంటల సమయం ఉందన్నారు.

అయితే సునాక్ సర్కార్ పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వరుసగా ప్రధానులు మారుతున్నా దేశ ప్రయోజనాలు పెద్దగా నెరవేరడం లేదన్న టాక్ బ్రిటిషర్లలో కనిపిస్తోంది. ముఖ్యంగా కన్జర్వేటివ్ పార్టీ విధానాలతో ప్రజలు విసుగెత్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్కాండల్ తో బోరిస్ జాన్సన్ పదవీచ్యుతుడు కాగా.. ఆయన స్థానంలో ప్రధానిగా అయిన లిజ్ ట్రస్.. కేవలం 44 రోజుల్లోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వారి వారసుడిగా అధికారంలోకి వచ్చిన రిషి సునాక్ సైతం...పెద్దగా అభివృద్ధి చేయలేదన్న అభిప్రాయం ఉంది. దీంతో విపక్షం వస్తే బతుకు బారమవుతుందని, ప్రజలకు సునాక్ తుది హెచ్చరిక జారీ చేసినట్లు రాజనీతిజ్ఞులు చెబుతున్నారు.

మరోవైపు తాజా సర్వేలతో ఉత్సాహంగా కనిపిస్తోన్న లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌.. ప్రతి ఓటు తమకు ముఖ్యమేనన్నారు. ‘‘ఒకవేళ అధికారం చేపడితే.. తమ ప్రభుత్వానికి అన్నీ సవాళ్లే ఉంటాయి. ఇప్పటికే వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థ, సంపద సృష్టి ఎంతో ముఖ్యమైన అంశాలు. వీటిలో 14ఏళ్ల క్రితంతో పోలిస్తే ఎందులోనూ పురోగతి లేదు. ఇది మారాలంటే ఎన్నికల్లో తీర్పు భిన్నంగా ఉండాల్సిందే’’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇలా విజయంపై అధికార, విపక్షాలు విశ్వాసం వ్యక్తం చేసుకుంటున్న వేళ జులై 4 బ్రిటిష్‌ ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :