ASBL Koncept Ambience
facebook whatsapp X

మోడీ టూర్ పై ఉక్రెయిన్ ఆశలు..

మోడీ టూర్ పై ఉక్రెయిన్ ఆశలు..

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు రెండేళ్లు పూర్తయింది. ఇప్పటికీ యుద్ధంలో ఎవరూ గెలిచే పరిస్థితి లేదు. ఇరువైపులా భారీ నష్టం వాటిల్లుతోంది. ఓవైపు అమెరికా, నాటో దేశాల మద్దతుతో ఉక్రెయిన్ పోరాడుతోంది. మరోవైపు రష్యా సైతం తన దగ్గరున్న అన్ని ఆయుధాలను ప్రయోగిస్తోంది. ఈక్రమంలో యుద్ధంలో అమాయక పౌరులు మృతి చెందడంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దండయాత్ర ఆపమంటే రష్యా వినడం లేదు. పైగా మరింతగా దాడికి దిగుతోంది. దీంతో ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి భారత్ కే ఉందని గతంలో అమెరికా సహా పలుదేశాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.

మరోవైపు .. ఉక్రెయిన్ సైతం పరోక్షంగా భారత జోక్యాన్ని కోరింది. ఇలాంటి తరుణంలో భారతప్రధాని మోడీ.. రష్యాలో పర్యటించడం, ఆయనకు క్రెమ్లిన్ ఘనంగా స్వాగతం పలకడాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. ప్రధానిమోడీతో సమావేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆలింగనం చేసుకున్నారు. అంతేకాదు.. ఆదేశ గౌరవ పురస్కారాన్ని సైతం అందజేశారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేలా పుతిన్ కు నచ్చజెప్పాలని అమెరికా కోరింది. మరోవైపు.. జెలెన్ స్కీ సైతం.. ఈ పరిణామంపై నిరాశ వ్యక్తం చేశారు. ఓఅతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రధాని.. ఓ నియంతను ఆలింగనం చేసుకోవడం విచారం కలిగించిందన్నారు.

ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఆదేశంలో భారత ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు మోడీ. ఓవైపు రెండు దేశాల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతున్న వేళ.. ఆదేశాలు రెండింటితోనూ సత్సంబంధాలు నెరుపుతూ మోడీ తనదైన దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ రెండు దేశాల అధ్యక్షులతో మోడీ భేటీ వెనక ఏదైనా వేరే నిగూఢ అజెండా ఉందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యుద్ధం కారణంగా జరుగుతున్న నష్టంపై ఇప్పటికే రష్యన్లలో తీవ్రవ్యతిరేకత ఉంది. కానీ అక్కడి నియంతృత్వం కారణంగా వారు మాట్లాడలేని పరిస్థితి ఉంది.మరోవైపు.. రష్యా సైనిక వర్గాల్లోనూ అసంతృప్తి గూడకట్టుకుని ఉందని.. ఇది ఎప్పటికైన ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీయొచ్చన్న ఆందోళనలో క్రెమ్లిన్ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మరోవైపు.. అంతూ, పొంతూ లేకుండా సాగుతున్న దాడులతో దారితెన్నూ లేకుండా అన్నట్లుంది ఉక్రెయిన్ల బతుకులు. ఈ రెండు దేశాలు కొన్నిషరతులతో యుద్ధ విరమణకు సై అంటున్నాయి. ఇలాంటి దేశాల మధ్య ఓసంధిలాంటిది కుదర్చగలిగితే అన్న ఆశలు కూడా ప్రపంచదేశాల్లో ఉన్నాయి . వాటిని మోడీ సర్కార్ సాధించగలిగే పరిస్థితి ఉంటుందా.. వేచి చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :