ASBL Koncept Ambience
facebook whatsapp X

అన్‌స్టాప‌బుల్-3.. ఫ‌స్ట్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

అన్‌స్టాప‌బుల్-3.. ఫ‌స్ట్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

నంద‌మూరి బాల‌కృష్ణ(Nandamuri Bala Krishna) హోస్ట్ గా వ్య‌వ‌హరించిన అన్‌స్టాప‌బుల్(Unstoppable) సీజ‌న్1,2 ఎంతటి విజ‌యాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ సీజ‌న్3 కి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ద‌స‌రాకు ఈ సీజ‌న్ కు మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. సీజ‌న్ 3పై బాల‌య్య(balayya) కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు.

ఇదిలా ఉంటే సీజ‌న్ 3 కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వినిపిస్తోంది. ఈ సీజ‌న్ లో ఫ‌స్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా దుల్క‌ర్ సల్మాన్(Dulquer salman) రాబోతున్న‌ట్లు స‌మాచారం. దుల్క‌ర్ న‌టించిన ల‌క్కీ భాస్క‌ర్(Lucky Bhaskar) అక్టోబ‌ర్ 31న రిలీజ్ కానున్న నేప‌థ్యంలో ఆ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా దుల్క‌ర్ ఈ షో లో పాల్గొన్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే దుల్క‌ర్ తో సీజ‌న్ 3 కోసం ఫ‌స్ట్ ఎపిసోడ్ ను షూట్ చేశార‌ని, ఈ ఎపిసోడ్ లో దుల్క‌ర్ తో పాటూ నిర్మాత నాగ వంశీ(Naga Vamsi), డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి(Venki Atluri) పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఈ ఎపిసోడ్ క‌చ్ఛితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు సీజ‌న్1, 2లో మిస్ అయిన మెగాస్టార్ చిరంజీవి(Magestar Charanjeevi) ని కూడా సీజ‌న్ 3లో తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది.  
 

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :