ASBL Koncept Ambience
facebook whatsapp X

బాబుతో అన్ స్టాపబుల్ గా అదరగొట్టిన బాలయ్య

బాబుతో అన్ స్టాపబుల్ గా అదరగొట్టిన బాలయ్య

టాలీవుడ్ టాక్ షోల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అన్‌స్టాప‌బుల్ సీజ‌న్4(Unstoppable season4) ఈ శుక్ర‌వారం నుంచి మొద‌లుకానున్న విష‌యం తెలిసిందే. సీజ‌న్4 ఫ‌స్ట్ ఎపిసోడ్ కోసం స్పెష‌ల్ గా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడి(nara Chandra babu Naidu)ని తీసుకునిరావ‌డం షోపై అంచ‌నాల‌ను పెంచింది. చంద్ర‌బాబు సీఎం అయ్యాక టీవీ షో కోసం కెమెరా ముందుకు రావ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్.

గ‌తంలోనే చంద్ర‌బాబు ఈ షోకు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈసారి విన్న‌ర్ లుగా బాల‌య్య(balaiah)‌-బాబు(babu)ల‌ మ‌ధ్య ఎలాంటి సంభాష‌ణ‌లు ఉండ‌బోతున్నాయ‌నేది ఆస‌క్తిగా ఉంది. అయితే ఈ ఎపిసోడ్‌లో బాబు ఏయే విష‌యాలు గురించి మాట్లాడార‌నేది చెప్ప‌డానికి ఆహా(Aha)టీమ్ ఎపిసోడ్ నుంచి ఒక 5 నిమిషాల కంటెంట్ తో ట్రైల‌ర్ ను రిలీజ్ చేసింది.

ఈ 5 నిమిషాల ట్రైల‌ర్ లో బాల‌య్య‌- బాబు మ‌ధ్య మంచి సంభాష‌ణే జ‌రిగింద‌ని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. అంద‌రూ ఊహించిన‌ట్లే బాబు గారు 50 రోజుల‌కు పైగా జైల్లో ఉన్న సంఘ‌ట‌న తాలూకు చ‌ర్చ ఎంతో ఎమోష‌న‌ల్ గా సాగింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan)క‌లిశాక జైలు గోడ‌ల మ‌ధ్య ఏం జ‌రిగిందోన‌నే విష‌యాన్ని కూడా బాబు గారు ఈ సంద‌ర్భంగా క్లారిటీ ఇచ్చారు. వీటితో పాటూ భువ‌నేశ్వ‌రి(Bhuvaneswari), బ్ర‌హ్మ‌ణి(Brahmini)తో పాటూ దేవాన్ష్(Devansh)తో కూడిన ఓ వీడియోను కూడా ఈ ట్రైల‌ర్ లో పెట్టారు. మొత్తానికి స‌రదా సెటైర్లు, రొమాంటిక్ సినిమా క‌బుర్లు కూడా బాల‌య్య‌, బాబు మ‌ధ్య జ‌రిగాయి. ఏదేమైనా కాంబినేష‌న్ రిపీట్ అయినా స‌రే క‌చ్ఛితంగా ఈ ఎపిసోడ్ చూడాల‌నే ఆస‌క్తిని క‌లిగించ‌డంలో అన్‌స్టాప‌బుల్ టీమ్ స‌క్సెస్ అయింది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :