హైదరాబాద్‌లో అలెగ్రో మైక్రో సిస్టమ్ ఏర్పాటు : మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణలో పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ సెమీకండర్టర్ల కంపెనీ అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్‌లో పరిశోధనాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో వినీత్ బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు కలిసింది. పలు ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలకు సెమీ కండక్టర్లు సరఫరా చేస్తున్నట్లు అలెగ్రో ప్రతినిధులు మంత్రికి వివరించారు. పెట్టుబడిదారులకు సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ముందుంటుందని మంత్రి వెల్లడిరచారు. అలెగ్రో పరిశోధనాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags :