ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది..?

వచ్చే నెల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార డెమొక్రాట్లు, విపక్ష రిపబ్లికన్లు తీవ్రంగా చెమటోడుస్తున్నారు. బైడన్ స్థానంలో హారిస్ వచ్చిన తర్వాత ... డెమొక్రాట్లు బాగా పుంజుకున్నారు. హారిస్ వాక్చాతుర్యం, ఇండియా, నల్లజాతి మూలాలు.. ట్రంప్ తో పోలిస్తే చిన్నవయస్కురాలు కావడం.. ఆమెకు, పార్టీకి కలిసివచ్చింది. అయితే విజయం మాత్రం.. ఇద్దరు నేతల మధ్య దోబూచులాడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

తాజాగా ఫాక్స్ న్యూస్ జాతీయ సర్వే ప్రకారం.. అధ్యక్ష రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. అధ్యక్ష పోటీలో కమలా హారిస్ (48శాతం) కన్నా ట్రంప్ (50 శాతం) ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇతర సర్వేలను పరిశీలిస్తే.. గత నెలలో హారిస్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ... తాజాగా సర్వేలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.అయితే, ఏడు కీలకమైన రాష్ట్రాల ఓటర్లలో హారిస్ 6 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. ఓటర్లలో, కాలేజీ గ్రాడ్యుయేట్లు, మహిళలు, నల్లజాతి ఓటర్లు, హిస్పానిక్ అమెరికన్ ఓటర్లలో హారిస్ ముందంజలో ఉంటే.. నాన్-కాలేజీ గ్రాడ్యుయేట్లు, పురుషులు, శ్వేతజాతీయ అమెరికన్ ఓటర్లలో ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

అక్టోబర్ 11 అక్టోబర్ 14 మధ్య నిర్వహించిన పోల్ సర్వేలో ట్రంప్ 2 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. గత నెలలో హారిస్ 2 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో 4 పాయింట్లతో ట్రంప్ దూసుకెళ్లారు. గత నెలలో కన్నా శ్వేతజాతీయుల నుంచి ఇప్పుడు 10 పాయింట్లు మద్దతు పెరగడంతో ట్రంప్ స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. 65ఏళ్ల వయస్సులో అంతకంటే ఎక్కువ వయస్సు గల ఓటర్లు (49శాతం), కాలేజీ డిగ్రీ (48శాతం) ఉన్నవారిలో రికార్డు స్థాయిలో మద్దతు లభించింది.అధ్యక్ష పదవి రేసులో గెలిచేందుకు కీలకమైన 270 ఎలక్టోరల్ ఓట్ల కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రతి ఒక్కరూ 200 ఎలక్టోరల్ ఓట్లను పొందగల బలమైన స్థానాల్లో గట్టి పోటీని ఇస్తున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :