ఆగమేఘాల మీద ఎంబసీని ఖాళీ చేసిన అగ్రరాజ్యం
ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అమెరికా పేర్కొంది. కీవ్‌లో తమ దౌత్య కార్యాలయంపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని అమెరికా వెల్లడిరచింది. ఈ నేపథ్యంలోనే ఎంబసీని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. నవంబర్ 20న దాడి జరగబోతోందని తమకు కచ్చితమైన సమాచారం అందిందని వెల్లడిరచింది. రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఎయిర్ అలర్ట్‌లు ప్రకటించగానే కీవ్‌లోని అమెరికా పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని కోరింది.
Tags :