ASBL Koncept Ambience
facebook whatsapp X

గ్రీన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. గ్రీన్ కార్డు వ్యాలిడిటీ పొడిగింపు..

గ్రీన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. గ్రీన్ కార్డు వ్యాలిడిటీ పొడిగింపు..

అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డు దారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. Green Card వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది. గతంలో గ్రీన్ కార్డు గడువు తీరినప్పటికీ మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు. ఇప్పుడు దీన్ని 36 నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) వెల్లడించింది. దీంతో గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించినట్లైంది. సాధారణంగా అమెరికాలో గ్రీన్ కార్డులు (Green Card) పొందినవారు ప్రతీ పదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి.

ఇందుకోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి ఆరు నెలల ముందే ఐ-90 ఫామ్ ను సమర్పించాలి. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కార్డు వ్యాలిడిటీని 24 నెలలు పొడిగిస్తూ రిసీట్ నోటీసు ఇస్తారు. దీంతో గ్రీన్ కార్డు గడువు తీరిపోయినా.. ఈ నోటీసుతో వారికి చట్టబద్ధమైన నివాస హోదా కొనసాగుతుంది. కొత్త కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగాలు, ప్రయాణాల సమయంలో వారు దాన్ని లీగల్ స్టేటస్ ప్రూఫ్ గా వినియోగించుకోవచ్చు. ఈ గ్రీన్ కార్డు అదనపు వ్యాలిడిటీని 36 నెలలకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది.

దీంతో కొత్త కార్డుల కోసం వేచిచూసే వారు మరింతకాలం చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదాను కొనసాగించేందుకు వీలు లభించినట్లవుతుంది. అయితే, కండిషనల్ రెసిడెన్సీ తీసుకునేవారి గ్రీన్ కార్డుల గడువు రెండేళ్లపాటే ఉంటుంది. వీరికి తాజా పొడిగింపు వర్తించదు. వీరు ముందుగా నివాస హోదాపై ఉన్న కండీషన్స్ తొలగించుకునేందుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కార్డు గడువు తీరే 90 రోజుల్లోపు దీన్ని చేసుకోవాలి. దరఖాస్తు అనుమతి పొందితే.. వారికి 10ఏళ్ల కాలానికి గ్రీన్ కార్డు లభిస్తుంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :