రిస్క్ లకు దూరంగా యువి సంస్థ
ప్రభాస్(Prabhas) ఫ్రెండ్స్ స్థాపించిన యువి క్రియేషన్స్(UV Creations) ఈ మధ్య చేదు అనుభవాలను చవి చూస్తుంది. మిర్చి(MIrchi) సినిమాతో స్టార్ట్ అయిన వీరి జర్నీ ఆ తర్వాత మిడ్ రేంజ్ హీరోలతో కూడా మంచి హిట్స్ అందుకున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్(Bhale Bhale Magadivoi), మహానుభావుడు(Mahanubhavudu), ప్రతీరోజూ పండగే(Prathiroju Pandgey) లాంటి సినిమాలు మంచి ప్రాఫిట్స్ సాధించాయి.
కానీ సాహో(Saaho), రాధేశ్యామ్(Radhe shyam) సినిమాలు యువిని గట్టి దెబ్బ కొట్టాయి. తెలుగులో ఆదిపురుష్(Adipurush) ను రిలీజ్ చేసి మరోసారి దెబ్బ తిన్నారు. రీసెంట్ గా కంగువ సినిమా నిర్మాణంలో భాగమై గట్టి దెబ్బ ఎదుర్కొన్నారు. అందుకే ఇకపై ఎలాంటి రిస్క్ లు తీసుకోకూడదని యువి నిర్మాతలు భావించి ఇప్పటికే మొదలవాల్సిన రెండు సినిమాలను పక్కన పెట్టేశారు.
రాధాకృష్ణ(Radhakrishna) దర్శకత్వంలో గోపీచంద్(Gopichand) హీరోగా ఓ సినిమా తీయాలని యువి క్రియేషన్స్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తోంది. కానీ రీసెంట్ గా గోపీచంద్ పెద్దగా ఫామ్ లో లేకపోవడంతో ఆ సినిమాను పక్కన పెట్టేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ 70ఎంఎం(70MM) అనే మరో సంస్థ చేతికి వెళ్లినట్లు సమాచారం. ఇది కాకుండా అఖిల్(Akhil) తో అనిల్(Anil) అనే కొత్త దర్శకుడితో రూ.100 కోటల్ బడ్జెట్ తో ఓ సినిమాను అనుకున్నారు. కానీ దీన్ని కూడా ఇప్పుడు హోల్డ్ లో పెట్టారు. యువి నుంచి వస్తున్న విశ్వంభర(Viswambhara)తో మంచి హిట్ కొట్టాకే మరో సినిమా జోలికి వెళ్లాలని యువి నిర్మాతలు భావిస్తున్నారట. అప్పటివరకు ఈ నిర్మాతలు రిస్క్ చేసే సాహసం చేయాలనుకోవడం లేదని తెలుస్తోంది.