ASBL Koncept Ambience
facebook whatsapp X

Pithapuram Varma vs Jansena:  పిఠాపురంలో అంతర్గత పోరు షురూ.. మళ్లీ వర్మ ఇండిపెండెంట్ గా మారుతాడా? 

Pithapuram Varma vs Jansena:  పిఠాపురంలో అంతర్గత పోరు షురూ.. మళ్లీ వర్మ ఇండిపెండెంట్ గా మారుతాడా? 

పదేళ్లుగా రాజకీయంగా ఎదగడానికి ఎంతో ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు 2024 ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram ) బాగా కలిసి వచ్చింది. గతంలో రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈ ఎన్నికల్లో మాత్రం పిఠాపురం(Pithapuram )  నుంచి బంపర్ మెజారిటీతో గెలిచారు. పరోపక పిఠాపురం జనసేన పీటం అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతం పిఠాపురం సాక్షిగా కూటమిలో అంతర్గత పోరు షురూ అయ్యే అవకాశాలు జోరుగా కనిపిస్తున్నాయి. 

జనసైనికుల (Jana sainikulu) జోష్ వర్మ మద్దతుదారులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సామాజిక వర్గానికి పెద్ద పీట వేసే పిఠాపురంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా వర్మ (Varma) తన సత్తా చాటుకున్నారు. వివక్షకు దూరంగా.. ప్రజలు అతనికి పట్టం కట్టిన తీరు.. పిఠాపురంలో వర్మకు ఎటువంటి అభిమానులు ఉన్నారో చెప్పకనే చెబుతుంది. అయితే అటువంటి వర్మా చంద్రబాబు మాట కాదనలేక పిఠాపురాన్ని పవన్ కు అప్పగించారు. 

అయితే వచ్చే ఎన్నికల్లో అయినా పిఠాపురం తన చేతికి వస్తుంది అని కలలు కంటున్న వర్మకు అది జరిగే సూచన కనిపించడం లేదు. రాజకీయాల్లో సెంటిమెంట్ లకి కొదవలేదు.. పవన్ కళ్యాణ్ ఒక్కడు గెలిస్తే గొప్ప అనుకునే పరిస్థితి నుంచి పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరిని గెలిపించే స్థితికి మారడానికి పిఠాపురం పెద్ద కారణమని పవన్ భావిస్తున్నారు. అందుకే పిఠాపురాన్ని తన పర్మనెంట్ అడ్డాగా చేసుకోవడానికి ఫిక్స్ అయ్యారని టాక్. 

దీంతో పిఠాపురం సాక్షిగా జనసేన వర్సెస్ టీడీపి ఆధిపత్య పోరు షురూ అయ్యేలా ఉంది. తాజాగా అక్కడ జరిగిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. అందుకే విడివిడిగా పోటీ చేశారు.. ఫలితంగా జనసేన నాలుగు డైరెక్టర్లను గెలుచుకుంటే.. ఒక్క పోస్ట్ ఇండిపెండెంట్ కు దక్కింది. వర్మ అనుచరులు ఓటమిపాలు అవ్వడం తో పిఠాపురంలో ఆయన మద్దతు దారులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

మాజీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత అయిన వర్మకు పిఠాపురంలో తగిన గౌరవం దక్కడం లేదు అని ఇప్పటికే బాధపడుతున్న అతని అనుచరులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. పిఠాపురం సీటు పవన్ కోసం వదులుకుంటే తొలి ఎమ్మెల్సీ ఇస్తాను అని ఇచ్చిన వాగ్దానం సంగతి కూడా అఘమ్యాగోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వర్మ ప్లేటు ఫిరాయించి తిరిగి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడేమో అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :