ఆ రెండు సినిమాలను మిస్ చేసుకున్న వరుణ్
లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమాతో డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) తన ఇమేజ్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. కెరీర్ మొదట్లో వరుసగా ఒకే రకమైన లవ్ స్టోరీలు తీశాడనే కామెంట్ వెంకీ పై ఉండేది. కానీ సార్(Sir) సినిమాతో తన ట్రాక్ మార్చిన వెంకీ లక్కీ భాస్కర్ తో తనలోని అసలైన టాలెంట్ ను బయటపెట్టాడు. అయితే సార్, లక్కీ భాస్కర్ సినిమాలు తెలుగు హీరోలతో వెంకీ ఎందుకు చేయలేదనే డిస్కషన్స్ అప్పట్లో బాగానే నడిచాయి.
టాలీవుడ్ లో కూడా ధనుష్(Dhanush), దుల్కర్(Dulquer) లాంటి ఇమేజ్ ఉన్న హీరోలున్నారు కదా అనే డౌట అందరికీ వచ్చింది. వాస్తవానికి ఈ రెండు కథలూ ధనుష్, దుల్కర్ కంటే ముందుగా వినింది వరుణ్ తేజేనట(Varun Tej). తొలిప్రేమ(Tholi Prema) సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే వెంకీ ఏ కథ రాసుకున్నా వరుణ్ కు చెప్తాడట. ఈ విషయాన్ని మట్కా(Matka) ప్రమోషన్స్ లో స్వయంగా వరుణే వెల్లడించాడు.
లక్కీ భాస్కర్ కథ కూడా తనకు చెప్పినప్పుడు బాగా అనిపించిందని, అయితే సార్ కథను తాను చేయాలనుకున్నానని, కానీ వెంకీ అప్పటికే ధనుష్ ను హీరోగా ఫిక్స్ అవడంతో కుదరలేదని, ఫ్యూచర్ లో మాత్రం వెంకీతో మరో సినిమా కచ్ఛితంగా చేస్తానని వరుణ్ ఈ సందర్భంగా తెలిపాడు. మట్కా సినిమా తర్వాత వరుణ్, మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వంలో కామెడీ హార్రర్ మూవీ చేయనున్నట్లు వెల్లడించాడు. తన చెల్లి నిహారిక(Niharika) బ్యానర్ లో కూడా ఓ సినిమా చేయనున్నట్లు వరుణ్ చెప్పాడు.