Vasireddy Padma: ఆర్ఆర్ఆర్ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నించి బోల్తా పడిన వాసిరెడ్డి..
రాజకీయ నాయకులు పార్టీకి పరిమితం కారు.. ఏ గాలికి ఆ గొడుగు అన్నట్టు.. పార్టీలు మారుతూ తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తారు. ఇప్పుడు రాజకీయాలలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు దగ్గర నుంచి అందరూ పార్టీలు మారుతూ వచ్చిన వారే. అయితే పార్టీ మారే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి. గుడ్డిగా ఒకరికి కలిసొచ్చింది కదా అని మనం కూడా అదే ట్రెండ్ ఫాలో అయితే కష్టాలు తప్పవు. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చీఫ్.. వాసిరెడ్డి పద్మ పరిస్థితి కూడా అలాగే ఉంది.
ఒకరకంగా ఈ కామి రాజకీయ చరిత్ర ముగిసినట్టే అన్న టాక్ నడుస్తోంది. దీనికి ముఖ్య కారణం వైసీపీ నుంచి బయటకు వచ్చి వాసిరెడ్డి రెండు మాసాలకు పైగా గడుస్తున్న ఇంకా ఏ పార్టీలో చేరకపోవడం. మొదట్లో ఆమె జనసేనలో చేరుతారు అన్న ప్రచారం జరిగింది.. అయితే ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు అని కొందరు అన్నారు. అయితే ఇటు గ్లాసు కు కానీ.. అటు సైకిల్ కు కానీ వాసిరెడ్డి గురించి ఆలోచించే ఉద్దేశం లేనట్టు కనిపిస్తోంది.
పార్టీ నుంచి బయటికి రావడంలో ప్రాబ్లం లేదు కానీ వస్తూ వస్తూ ఆ పార్టీ అధినేత పై తీవ్ర విమర్శలు చేసి.. రోడ్డుకు లాగాలి అనుకోవడం ప్రస్తుత రాజకీయాలకు సెట్ కాదు. అయితే రఘురామకృష్ణ రాజు లాంటి వారి పరిస్థితి డిఫరెంట్. తాను వచ్చిన పార్టీపై తీవ్ర విమర్శలు చేసి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి దక్కించుకున్నాడు.. అయితే అది అతని లక్ పై కూడా ఆధారపడి ఉండొచ్చు.
వైసీపీ హయాంలో ఎన్నో వేధింపులకు గురయ్యానని.. ఒక ఎంపీ ని అని కూడా చూడకుండా పోలీసులు కొట్టారని రోడ్డుకి సింపతి తెచ్చుకున్నాడు రఘురామకృష్ణరాజు.
మంచి మాటకారి, జనంలో మంచి ఫాలోయింగ్ ఉంది.. ఏదన్న విషయాన్ని కరాకండిగా మోహన అడిగేస్తాడు.. ఆయన ప్లస్ లు ఆయనకి ఉన్నాయి కాబట్టి కూటమి పిలిచి మరి పదవి కట్టబెట్టింది. అయితే వాసిరెడ్డి విషయానికి వస్తే ఆ ఛాన్స్ కనిపించేలా లేదు. మరి ముఖ్యంగా టీడీపీ లో ఓ బలమైన మహిళ నేత ఆమె ఎంట్రీని బ్లాక్ చేస్తున్నారని గట్టిగా టాక్ నడుస్తోంది. మరో పక్క పవన్ కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన వారితో పార్టీని నింపితే.. భవిష్యత్తులో మిగిలిన వర్గాలు తమ పార్టీపై నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకునే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి రెండు పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లేక వాసిరెడ్డి పద్మ రాజకీయం వికసించడం లేదు అని అందరూ భావిస్తున్నారు.