ASBL Koncept Ambience
facebook whatsapp X

ఈ నెల 20న వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ "ఫియర్" టీజర్ రిలీజ్

ఈ నెల 20న వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ "ఫియర్" టీజర్ రిలీజ్

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు Dr. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ రోజు "ఫియర్" సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా  స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేతుల మీదుగా రిలీజ్ చేసిన "ఫియర్" సినిమా  ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో "ఫియర్" సినిమా టీజర్ పై మంచి క్రేజ్ ఏర్పడుతోంది. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన "ఫియర్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :