ASBL NSL Infratech
facebook whatsapp X

తెలంగాణలో వెమ్‌ టెక్నాలజీస్‌ 1,000 కోట్ల పెట్టుబడి

తెలంగాణలో వెమ్‌ టెక్నాలజీస్‌ 1,000 కోట్ల పెట్టుబడి

రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి సంస్థ వెమ్‌ టెక్నాలజీస్‌ తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ ప్రాజెక్టులో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు. జహీరాబాద్‌ నిమ్జ్‌లో  511 ఎకరాల్లో ఏర్పాటువుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ట్రయల్‌ ప్రొడక్షన్‌కు సిద్ధమవుతుందని తెలిపారు. మొదటి దశ పూర్తయితే వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని శ్రీధర్‌బాబు తెలిపారు. 

సచివాలయంలో వెబ్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. కేటాయించిన భూమిలో ఇంకా స్వాధీనం చేయాల్సిన 43 ఎకరాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతికి మంత్రి సూచించారు. ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన 33 కె.వి. విద్యుత్తు లైన్లను నాలుగు నెలల్లో ఏర్పాటు చేసి సరఫరా ప్రారంభించాలని ట్రాన్స్‌ కో అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వెమ్‌ టెక్నాలజీస్‌ సీఎండీ వి.వెంకటరాజు, సంస్థ ప్రతినిధులు ఆర్‌ఎస్‌ఎస్‌ రావు, కె.,రంగరాజు, ఆర్‌.వి.రమణ, డీవీఎస్‌ రాజు, సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరి క్రాంతి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, ట్రాన్‌ కో డైరెక్టర్‌ జగత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :