ASBL NSL Infratech

మ‌రో మ‌ల్టీస్టార‌ర్ లో వెంకీ

మ‌రో మ‌ల్టీస్టార‌ర్ లో వెంకీ

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు బ్యాన‌ర్ లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. జులై 3న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంచ్ కానున్న‌ట్లు ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్క‌నుంది. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని ఇప్ప‌టికే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చక్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమా మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్క‌నుంద‌ని, సెకండ్ హీరో క్యారెక్ట‌ర్ కోసం డిస్క‌ష‌న్స్ స్టార్ట్ అయిన‌ట్లు, 30 నిమిషాల పాటూ ఆ పాత్రకు సినిమాలో స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంద‌ని టాక్. ఈ పాత్ర కోసం అనిల్ రావిపూడి, నంద‌మూరి బాల‌కృష్ణ‌తో డిస్క‌ష‌న్స్ చేస్తున్నాడ‌ట‌.

బాల‌య్య అందుబాటులో లేక‌పోతే వేరే హీరోల కోసం చూస్తార‌ట‌. బాల‌య్య పాజిటివ్ గా రెస్పాండ్ అయితే మాత్రం ఈ సినిమా క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్ల‌డం ఖాయం. వేరే హీరోల సినిమాల్లో న‌టించ‌డానికి బాల‌య్య ఎప్పుడూ రెడీగా ఉంటాడు. కానీ బాల‌య్య ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉన్నాడు. డేట్స్ అడ్జెస్ట్ చేయ‌గ‌ల‌గ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌. మ‌రి ఈ కాంబో వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో చూడాలి.

 

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :